క్షిణిస్తున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం

Advertisement

ప్రణబ్‌ ముఖర్జీ (84) ఆగస్టు 10న ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆక్కడ మెదడుకు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించిన అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అంతేకాకుండా ఆయనకు కొవిడ్‌-19 సోకింది.అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందని వైద్యులు తెలిపారు.

గత కొద్దీ కాలంగా కోమలోనే ఉన్న ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వల్ల ఆదివారం నుండి సెప్టిక్ షాక్ లో ఉన్నారని వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ సమస్యకు ప్రత్యేక వైద్య బృందాలు చికిత్స అందిస్తున్నాయి. కాగా ఆయన కోమాలోనే ఉన్నారని.. వెంటిలేటర్‌ సహాయంతో చికిత్స కొనసాగిస్తున్నామని వైద్యాధికారులు తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ తొందరగా కోలుకోవాలని దేశ వ్యాప్తంగా ఆయనను అభిమానించే వారు పూజలు చేస్తున్నారు. ఆయన తొందరగా కోలుకోవాలని రాజకీయ నాయకులు కూడా పూజలు చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here