Manmohan Singh: క్షీణించిన మాజీ ప్ర‌ధాని ఆరోగ్యం.. ఐసీయూలో కొన‌సాగుతున్న చికిత్స‌

Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఈ ఏడాది ఆరంభంలో కోవిడ్-19తో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన మ‌న్మోహ‌న్ తాజాగా జ్వరం, నీరసంతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. 88 సంవత్సరాల మన్మోహన్ సింగ్ నిన్నటి నుంచి జ్వరంతో బాధపడుతుండగా,ఆయ‌న పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఎయిమ్స్ వైదులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు.

Former PM Manmohan Singh Admitted To AIIMS With Fever And Weakness
Former PM Manmohan Singh Admitted To AIIMS With Fever And Weakness

మన్మోహన్ సింగ్‌కు సాధారణ చికిత్స జరుగుతోందని వైద్యులు అన్నారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. మన్మోహన్ సింగ్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను ఆయన ఖండించారు. ఏదైనా అప్‌డేట్స్ ఉంటే తామే స్వయంగా చెబుతామని వెల్లడించారు. మన్మోహన్ సింగ్ ఆస్పత్రిలో చేరారనే వార్త తెలిసిన వెంటనే కాంగ్రెస్ నేతలు స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

డాక్టర్ రణ్ దీప్ గులేరియా, ఎయిమ్స్ నేతృత్వంలో వైద్య బృందం ప్రస్తుతం ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. 2009 లో మన్మోహన్ సింగ్‌ ఎయిమ్స్‌లో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. మన్మోహన్ సింగ్ ప్రస్తుతం రాజస్థాన్ నుండి రాజ్యసభ సభ్యుడుగా కొనసాగుతున్నారు. అతను 2004 నుండి 2014 వరకు దేశ ప్రధాన మంత్రిగా ఉన్నారు.

2004లో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత మన్మోహన్ సింగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపించారు. 2009లో యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత మన్మోహన్ సింగ్ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన సారథ్యంలో యూపీఏ అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చింది. వయోభారం, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు.