కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూత
Admin - August 8, 2020 / 07:27 AM IST

హైదరాబాద్: దేశంలో ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు కరోనా భారిన పడ్డారు. వారిలో చాలా మంది కరోనాతో పోరాడలేక మృతి చెందారు. ఇప్పుడు తాజాగా మాజీ ఎంపీ నంది ఎల్లయ్య(78) కూడా కరోనా కారణంగా మృతి చెందారు. 10 రోజుల నుండి హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ మృతి చెందారు.
జులై 1, 1942 లో హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో జన్మించిన నంది ఎల్లయ్య టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా నంది ఎల్లయ్య పని చేశారు. 5సార్లు లోక్ సభకు, 2సార్లు రాజ్య సభకు ఎన్నికయ్యారు. నంది ఎల్లయ్యకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
నంది ఎల్లయ్య మరణంతో ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయ్యారు. ఎల్లయ్య ఆకస్మిక మృతిపై కాంగ్రెస్ పెద్దలు కూడా దిగ్భ్రాంతికి గురి అయ్యారు. ఎల్లయ్య కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ నాయకులు సంతాపం తెలుపుతూ, ఆయన మృతి కాంగ్రెస్ కు తీరని లోటని వ్యాఖ్యానించారు.