దేశ ఆర్థిక క్షిణత పై ముందుగానే ప్రభుత్వాన్ని హెచ్చరించాం: చిదంబరం

Advertisement

నిన్న నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ విడుదల చేసిన జిడిపి ఫలితాలు దేశంలో సంచలనం సృష్టిస్తున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో జీడీపీ మైనస్ 23.9 శాతానికి పడిపోయిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వెల్లడించింది. దీని తరువాత త్రైమాసికంలో కూడా జిడిపి నెగటివ్ లోనే ఉంటే దేశంలో ఆర్థిక మాంద్యం రానుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు చిదంబరం స్పందించారు.

దేశంలో ఆర్థిక క్షిణతపై ప్రభుత్వాన్ని మొదటి నుండి తాము హెచ్చరిస్తూనే ఉన్నామని, భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉందన్న విషయం బహుశా ప్రధానమంత్రికి, ఆర్దికమంత్రికి తప్ప అందరికీ తెలుసని చిదంబరం ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ చేతకాని తనం వల్ల దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా నిరుపేద ప్రజలు మరింత పేదరికంలో కురుకుపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇన్నాళ్లు చెప్పిన కథలన్నీ ఇప్పుడు అధికారికంగా అబద్దాలని నిరూపణ అయ్యిందని చిదంబరం వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here