గుండె పోటుతో మాజీ క్రికెటర్ మృతి

Advertisement

మాజీ‌ క్రికెటర్‌ గోపాలస్వామి కస్తూరిరంగన్‌ (89) గుండెపోటుతో ఈరోజు ఉదయం మృతి చెందారు. అయితే బెంగళూరులోని చామరాజపేట స్వగృహంలో ఆయన కన్ను మూశారు. ఈ విషయాన్నీ కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం కార్యదర్శి వినయ మృత్యుంజయ మీడియాకు తెలిపారు. అయితే గోపాలస్వామి ఆటగాడిగానే కాకుండా క్రికెట్‌ పాలకుడు, బీసీసీఐ క్యూరేటర్‌గా కూడా ఆయన పనిచేసారు.

అయితే 1948-1963 వరకు రంజీ క్రికెట్లో గోపాలస్వామి మైసూర్‌ తరుపున ఆడారు. ఇక ఆయన మరణ వార్త విన్న టీం ఇండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే స్పందిస్తూ.. గోపాల స్వామి మరణించడం బాధాకరమైన విషయం, క్రికెట్ అభివృద్ధి కోసం ఆయన చాలా కృషి చేసాడని కొనియాడారు. అలాగే గోపాలస్వామి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాని ట్వీట్టర్ ద్వారా వెల్లడించాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here