Chandrababu : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ‘బర్త్ డే’ విషెస్.!
NQ Staff - December 21, 2022 / 04:28 PM IST

Chandrababu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సోషల్ మీడియా వేదికగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
రాజకీయాల్లో విమర్శలు సహజాతి సహజం. విమర్శల దారి విమర్శలదే. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా వైఎస్ జగన్ విషెస్ అందిస్తారు.. వైఎస్ జగన్ పుట్టినరోజు నాడు చంద్రబాబు విషెస్ అందించడమూ మామూలే. కాకపోతే, ఆ విషెస్ చాలా పొడి పొడిగా వుంటాయ్.. అంతే తేడా.
జస్ట్.. అలా తేల్చేశారు చంద్రబాబు..
‘హ్యాపీ బర్త్ డే’ అంటూ వైఎస్ జగన్ ట్విట్టర్ హ్యాండిల్‌ని కోట్ చేస్తూ బర్త్ డే విషెస్ అందించారు చంద్రబాబు. ఏపీ సీఎం అనిగానీ, ‘గారు’ అనిగానీ చంద్రబాబు ప్రస్తావించలేదు.
మరోపక్క, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..’ అంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ‘ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను’ అని కూడా పేర్కొన్నారు.
రాజకీయ వైరం వేరు.. శతృత్వం వేరు. నిజానికి, రాజకీయాల్లో శతృవులు వుండకూడదు.. వైరిపక్షాలు మాత్రమే వుండాలి.. అదీ రాజకీయంగానే.!