CM Buddhadeb Bhattacharya: బావ ముఖ్య‌మంత్రి.. ఆమె వైరాలజీలో పీహెచ్‌డీ.. ఫ్ర‌స్తుతం ఫుట్‌పాత్‌పై జీవ‌నం

CM Buddhadeb Bhattacharya: బండ్లు ఓడ‌లు, ఓడ‌లు బండ్లు అవడం గురించి మ‌నం త‌ర‌చు వింటుంటాం. కాని అలాంటివి నిజ జీవితంలో ఎన్నో జ‌రుగుతున్నాయి. వాటిని చూసి ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.తాజాగా పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో కీలక నాయకుడిగా వెలుగొందిన బుద్ధ దేవ్ భ‌ట్టాచార్య భార్య చెల్లెలు ఇప్పుడు ఫుట్ పాత్ మీద జీవ‌నం గ‌డుపుతుంది. పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లా బరాబజార్‌ ప్రాంతంలోని దున్లాప్‌లో మాసిపోయిన గుడ్డ‌ల‌తో బిచ్చ‌మెత్తుకుంటూ క‌నిపించింది.

Former Bengal CM Buddhadeb Bhattacharya’s sister-in-law found living on Kolkata footpath
Former Bengal CM Buddhadeb Bhattacharya’s sister-in-law found living on Kolkata footpath

ఆమె పేరు ఇరా బ‌సు. ఈమె ఎవ‌రో కాదు పదేళ్ల పాటు బెంగాల్‌ ముఖ్యమంత్రిగా పని చేసిన భార్య మీరా సోద‌రి. ఇరా వైరాలజీలో పీహెచ్‌డీ చేసింది. ఆమె అద్భుతంగా ఆంగ్లంతోపాటు బెంగాలీ మాట్లాడగలదు. అంతేకాదు రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నీస్‌ క్రీడాకారిణి. క్రికెట్‌లో కూడా రాష్ట్రస్థాయిలో ఆడింది. ఎంతో టాలెంట్ ఉన్న ఆమె 1976లో ప్రియానాథ్‌ బాలిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ జీవితం ప్రారంభించి 2009లో పదవీ విరమణ పొందారు.


గత రెండేళ్లుగా ఆమె ఫుట్‌పాత్‌పైన జీవ‌నం గ‌డుపుతుంది. ఆమె టీచర్‌గా ఉన్నప్పుడు బావ బుద్ధదేవ్‌ భట్టాచార్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో బరానగర్‌లో ఉంటున్న ఆమె ఖర్దాలోని లిచూ బగాన్‌కు మకాం మార్చారు. ఇప్పుడు దున్లాప్‌లోని ఫుట్‌పాత్‌పై జీవనం సాగిస్తోంది. ఆమె అలా జీవనం సాగించడంపై ఆమె పనిచేసిన ప్రియానాథ్‌ పాఠశాల హెడ్‌ మిస్ట్రెస్‌ కృష్ణకాలి చందా స్పందించారు. ‘


ఇరా బసు మా పాఠశాలలోనే బోధించారు. పదవీ విరమణ అనంతరం పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకోమని చెబితే ఇంతవరకు ఆమె పత్రాలు సమర్పించలేదు. ఆమె ఎందుకు పింఛన్‌కు దరఖాస్తు చేసుకోలేదో తెలియదు’ అని పేర్కొన్నారు.ఉపాధ్యాయ దినోత్సవం నాడు మాత్రం ఇరాబసును కొందరు స్థానిక సంఘాల నాయకులు సన్మానించారు. పూలమాల.. శాలువా వేసి సన్మానించారు.


ఆ స‌భ‌లో మాట్లాడిన ఇరా బ‌సు.. . ‘నన్ను ఎంతో మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు గుర్తు చేసుకుంటున్నారు. ఇంకా నన్ను ప్రేమిస్తున్నారు. కొందరు నన్ను కౌగిలించుకుని కన్నీళ్లు పెడతారు’ అని తెలిపింది. ఆమె ఫుట్‌పాత్‌పై జీవిస్తున్నది తెలుసుకున్న అధికారులు ఆమెను వెంటనే అంబులెన్స్‌లో కలకత్తాకు తీసుకెళ్లారు. ఆమెకు వైద్యారోగ్య పరీక్షలు చేయించి చికిత్స అందించే అవకాశం ఉంది.