Cricket : క్రికెట్ చరిత్రలో రేర్ ఫీట్.. ఒక్క బంతికి 16 పరుగులు
NQ Staff - January 23, 2023 / 10:15 PM IST

Cricket : క్రికెట్ లో ఒక బంతికి అత్యధికంగా ఏడు పరుగులు వస్తాయి. నో బాల్ కి సిక్స్ అయితే ఆ తర్వాత ఫ్రీ హిట్ తో మరో సిక్స్ లభిస్తే మొత్తంగా 13 పరుగులు రావడం అప్పుడప్పుడు జరుగుతుంది. తాజాగా బిగ్ బాష్ లీగ్ లో ఏకంగా ఒక్క బంతికి 16 పరుగులు వచ్చాయి.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాష్ లీగ్ లో భాగంగా సిడ్నీ సిక్సర్స్ తో హోబర్ట్ హరికేన్స్ లు తలబడ్డారు. ఆ సమయంలో జోయల్ పారిస్ ఓ బంతికి 16 పరుగులు సమర్పించుకున్నాడు.
సిక్సర్స్ బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ రెండవ ఓవర్ వేసిన పారిస్ మొదటి రెండు బంతులను డాట్ బాల్ గా వేశాడు. ఆ తర్వాత వేసిన బంతిని భారీ సిక్స్ గా స్టీవ్ స్మిత్ ఫిక్స్ గా మలిచాడు. అయితే ఆ బాల్ నో బాల్ అవడంతో ఫ్రీ హిట్ లభించింది. దాంతో మరో బంతి ఆడే అవకాశం దొరికింది.
అయితే ఈసారి వైడ్ వేయడంతో ఐదు పరుగు అదనంగా లభించాయి. ఆ తర్వాత బంతికి ఫోర్ కొట్టాడు. అలా మొత్తంగా 16 పరుగులు ఒకే బాల్ కి వచ్చాయి. ఇలా ఒక్క బాల్ కి 16 పరుగులు రావడం క్రికెట్ చరిత్రలో ఇదే ప్రథమం అంటూ క్రీడా పండితులు సరదాగా మాట్లాడుకుంటున్నారు.
15 runs off one legal delivery! 😵💫
Steve Smith's cashing in once again in Hobart 🙌#BucketBall #BBL12 pic.twitter.com/G3YiCbTjX7
— KFC Big Bash League (@BBL) January 23, 2023