ఆన్ లైన్ క్లాసుల కోసం ఆవును అమ్మిన తండ్రి

Advertisement

కరోనా కష్టకాలంలో ప్రతిఒక్కరి పరిస్థితి దారుణంగా మారింది. పని లేక చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక స్కూళ్ళు, కాలేజీలు అన్నీ కూడా మూతపడ్డాయి. దీనితో చాలా వరకు స్కూళ్లలో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇది ఇలా ఉంటె తమ పిల్లల ఆన్ లైన్ క్లాసుల కోసం వాళ్ళ దగ్గర ఉన్న ఆవును అమ్మేశారు ఓ పేద కుటుంబం. అయితే ఈ ఘటన హరియాణా రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే హరియానాలోని జ్వాలాముఖి ప్రాంతానికి చెందిన కుల్దీప్ కు ఇద్దరు పిల్లలు. వీరిలో ఒకరు రెండవ తరగతి మరియు ఇంకొకరు నాలుగవ తరగతి చదువుతున్నారు. అయితే ఈ కుటుంబానికి ఆవు మాత్రమే జీవనోపాధి. అయితే వాళ్ళ పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు మొదలయ్యాయి అని స్మార్ట్ ఫోన్ లో క్లాసులు వినాలని సమాచారం ఇచ్చారు స్కూలు యాజమాన్యం. అప్పటికి కుల్దీప్ జేబులో నయా రూపాయి కూడా లేదు. దగ్గర్లో ఉన్న బ్యాంకులను మరియు ప్రవేట్ ఫైనాన్స్ కంపెనీలను సంప్రదించాడు. కానీ ఎవ్వరు కూడా తనకు రూపాయి కూడా అప్పు ఇవ్వలేదు. దీనితో చేసేది ఏమి లేకా, తన దగ్గర ఉన్న ఆవును ఆరు వేల రూపాయలకు అమ్మేసి, తన పిల్లలకు కావలసిన స్మార్ట్ ఫోన్ ని కొన్నాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here