ప్రియుని కోసం వారంలో 25 లక్షలు ఖర్చుపెట్టిన హీరోయిన్

Admin - September 26, 2020 / 12:14 PM IST

ప్రియుని కోసం వారంలో 25 లక్షలు ఖర్చుపెట్టిన హీరోయిన్

హీరోయిన్ నయనతార తెలియని వారంటూ ఎవ్వరు ఉండరు. తెలుగుతో సహా మరికొన్ని భాషల్లో గత కొన్నేళ్లు గా అగ్రతారల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ భామ విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో కొద్ది రోజుల క్రితం ప్రియునితో కలిసి గోవాకు విహారయాత్రకు వెళ్ళింది. వాస్తవానికి ఈ ట్రిప్ విదేశాల్లో జరగాల్సి ఉండేది. కరోనా మహమ్మారి కారణంగా నయనతార, శివన్ లు గోవాకు ప్లాన్ చేసుకున్నారు.

ఇక ఈ గోవా ట్రిప్ కోసం ఈ ప్రేమ జంట ప్రత్యేకంగా ఓ విమానాన్నే బుక్ చేసుకోవడం విశేషం అని చెప్పాలి. అంతేకాదు గోవాలో కూడా ఓ రిసార్ట్ ను బుక్ చేసుకున్నారు. అయితే మొత్తం ఈ ట్రిప్ వారం రోజులు జరగగా.. నయనతార చేసిన మొత్తం ఖర్చు కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే. నయనతార ఒక్కో సినిమాకు రూ. ఐదు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటోన్న ఆమె ఈ ఖర్చు పెద్ద లెక్కేం కాదు కదా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us