America : అమెరికాలో విమాన సేవలకు అంతరాయం.. అంతా అతలాకుతలం
NQ Staff - January 12, 2023 / 11:28 AM IST

America : అత్యంత ఆధునాతన టెక్నాలజీ ఉన్న అమెరికాలో కొన్ని గంటల పాటు విమాన సర్వీసులు నిలిచి పోవడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. సాంకేతిక లోపం కారణంగా దేశ వ్యాప్తంగా మొత్తం విమానాల యొక్క సర్వీసులు కొన్ని గంటల పాటు నిలిచి పోయాయి.
విమాన సర్వీసులను నిలిపి వేస్తున్నట్లుగా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ప్రకటించారు. విమానాలు ఎప్పుడు నడిచేది ఆ సమయంలో చెప్పలేమని అధికారులు పేర్కొన్నారు. ముందస్తుగా సమాచారం లేకుండా విమానాలు నిలిచి పోవడంతో లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.
ఎఫ్ఏఏ కంప్యూటర్ సిస్టమ్ లో టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా విమాన సర్వీసులకు సంబంధించిన సమస్య తలెత్తినట్లుగా అధికారులు పేర్కొన్నారు. దాదాపుగా 3500 లకు పైగా విమానాలు రద్దు అవ్వగా.. ప్రస్తుతం అవన్నీ కూడా కొన్ని గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ లో తలెత్తిన టెక్నికల్ సమస్యకు పరిష్కారం లభించిందని.. దాంతో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి లో మళ్లీ విమాన సర్వీసులు పునః ప్రారంభం అయ్యాయి.