తల్లికి కరోనా నెగిటివ్. అప్పుడే పుట్టిన బిడ్డకు పాజిటివ్

Advertisement

మొట్ట మొదటి సారిగా తల్లికి కరోనా నెగిటివ్ రాగ అప్పుడే పుట్టిన బిడ్డకు పాజిటివ్ వచ్చిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే ఢిల్లీలోని నాంగ్లోయికి చెందిన 25 ఏళ్ల గర్భిణీ మహిళ జూన్ 11న రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో కరోనాతో చేరింది. కరోనా అని నిర్ధారణ కాగానే తగిన విధంగా చికిత్స తీసుకుంటూ మరల జూన్ 25న పరీక్ష చేయించగా పాజిటివ్ అనే తేలింది అయితే అప్పటికి గర్భిణీ అయిన ఈ మహిళ చివరగా జులై 7న కరోనా పరీక్షలు జరుపుకోగా నెగిటివ్ రావడం జరిగింది.

అదే ఆనందంలో ఆ నెగిటివ్ వచ్చిన మహిళ మరుసటి రోజే తన బిడ్డకి జన్మనిచ్చింది. ఆలా పుట్టిన బిడ్డకు వైద్య పరీక్షల్లో భాగంగా సాంపిల్స్ తీసుకొని కరోనా పరీక్షలు జరుపగా పాజిటివ్ అంటూ తేలింది. దానితో వైద్యులు సైతం బిత్తరపోయారు. అయితే ఇటీవల చైనా వాళ్ళు జరిపిన పరిశోధనలో కూడా తల్లి నుండి బిడ్డకు బొడ్డు తాడు ద్వారా కరోనా సోకె అవకాశాలు ఉన్నాయి అంటూ వెల్లడించడం జరిగింది.

ఇంత వరకు ఎప్పుడు ఎక్కడ కూడా అలా జరగకపోవడంతో ఆ పరిశోధనని పెద్దగా పట్టించుకోలేదు వైద్యులు మరియు శాస్త్రవేత్తలు. అయితే ఇలా మొదటిసారిగా జరిగింది అని ఆ మహిళాకి వైద్యం చేసిన లోహియా హాస్పిటల్ కి చెందిన వైద్యులు తెలిపారు. అలా పుట్టినా బిడ్డకు పాజిటివ్ రావడంతో తల్లికి కూడా మరల పరీక్షలు జరిపినప్పటికీ తనకు నెగిటివ్ అంటూ తేలింది అని చెప్పుకొచ్చారు. బొడ్డు తాడు ద్వారా సోకిన బిడ్డకి పాజిటివ్ ఎలా ఉంది. కరోనా నుండి కోలుకున్నప్పటికీ బిడ్డ మాత్రం తల్లి కడుపు నుండే వస్తుంది కదా మరి ఆ మహిళకి ఎలా నెగిటివ్ ఉంది అన్న విషయం మాత్రం తేలలేదు. అయితే ప్రస్తుతం ఎక్కువ స్థాయిలో బిడ్డకు కరోనా సోకడంతో అక్కడి వైద్యులు ఆ శిశువుకి చికిత్స అందిస్తున్నట్లు తెలపడం జరిగింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here