ఆవుదూడ కోసం 5మంది మృతి

Advertisement

ఆవుదూడ కోసం ఐదుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ ‌రాష్ట్రంలో గోండా జిల్లాలోని రాజా మొహల్లా గ్రామంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అయితే ఓ పురాతనమైన పాడుబడిన బావిలో పడిపోయిన ఆవుదూడను కాపాడే క్రమంలో అయిదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు చెత్త వేసే ఒక పాడుబడ్డ బావిలో ఒక ఆవుదూడ ప్రమాదశాత్తు పడింది. అయితే ఆ ఆవుదూడను ఒక వ్యక్తి గమనించి కాపాడటానికి ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆ ఆవుదూడను కాపాడేందుకు నిచ్చెన సహాయంతో ఆ బావిలోకి దిగాడు.

ఇక ఆ బావిలో నుండి వస్తున్న చెడు వాయువును ఆ వ్యక్తి పీల్చుకొని స్పృహ కోల్పోయాడు. ఇక ఆ వ్యక్తిని బయటకు తీయడానికి మరో నలుగురు ఆ బావిలోకి దిగారు. ఇక ఆ నలుగురు కూడా ఆ బావి లో నుండి వచ్చే విష వాయివును పీల్చుకొని స్పృహ కోల్పోయారు. ఇక చివరకు ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మృతి చెందిన వారిని బయటకు తీశారు. అయితే విష వాయువు వలనే వారు ప్రాణాలు కోల్పోయారని పోస్ట్ మార్టంలో డాక్టర్లు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here