Bigg Boss : తొలిసారి బిగ్ బాస్ హోస్ట్‌గా శింబు.. పారితోషికం ఎంతో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోక మాన‌రు..!

NQ Staff - February 28, 2022 / 09:02 PM IST

Bigg Boss     :    తొలిసారి బిగ్ బాస్ హోస్ట్‌గా శింబు.. పారితోషికం ఎంతో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోక మాన‌రు..!

Bigg Boss     :    బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్య‌క్ర‌మం అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో స‌క్సెస్ ఫుల్‌గా సాగుతున్న విష‌యం తెలిసిందే. తమిళ బిగ్‌బాస్ ఓటీటీ షో అల్టిమేట్‌ నుంచి హోస్ట్‌గా కమల్ హాసన్ తప్పుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇప్పటి వరకు తమిళ బిగ్‌బాస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన కమల్ అనూహ్యమైన నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత తన నిర్ణయంపై క్లారిటీ ఇవ్వడంతో అభిమానుల్లో ఆందోళన తగ్గింది.

ఇటీవల ఓటీటీలో 24 గంటలపాటు స్ట్రీమింగ్ అయ్యే ఓటీటీ ఫార్మాట్ బిగ్‌బాస్ అల్టిమేట్‌కు కూడా కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరించారు. అయితే కొద్దివారాల అనంతరం తాను బిగ్‌బాస్ అల్టీమేట్ నుంచి తప్పుకొంటున్నాను. అందుకు కారణం తాను నిర్మిస్తున్న విక్రమ్ సినిమానే కారణం. కోవిడ్ కారణంగా విక్రమ్ షూటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం ఆ సినిమాను వేగంగా ఫినిష్ చేయాలని అనుకొంటున్నాం. అందుకే త‌ప్పుకుంటున్న‌ట్టు తెలియ‌జేశారు.

First Time Simbu  Bigg Boss show Remuneration  well taken

First Time Simbu Bigg Boss show Remuneration well taken

క‌మ‌ల్ హాస‌న్ త‌ప్పుకోవ‌డంతో ఆ స్థానాన్ని శింబు భ‌ర్తీ చేశారు. ఇప్ప‌టికే బిగ్‌బాస్‌ తెలుగు సీజన్లకు ఎన్టీఆర్‌, నాని, నాగార్జున వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా తమిళ షోకు కమల్‌ హాసన్‌, కన్నడ షోకు సుదీప్‌, మలయాళంలో మోహన్‌ లాల్‌, హిందీ షోకు సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా పని చేశారు. ఇప్పుడు హోస్ట్‌గా శింబు వ‌చ్చి చేరాడు.

బిగ్‌బాస్‌ అల్టిమేట్‌ షోకు శింబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇతడిని షోకు రప్పించేందుకు బిగ్‌బాస్‌ నిర్వాహకులు బాగానే ముట్టజెప్పారట! ఒక్క ఎపిసోడ్‌కు సుమారు కోటి రూపాయల దాకా పారితోషికం ఇస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ లెక్కన బిగ్‌బాస్‌ ద్వారా శింబు రూ.5 కోట్లు వెనకేయనున్నట్లు కనిపిస్తోంది.

Read Today's Latest గుసగుసలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us