భారత్, చైనా దళాలు గాల్లో 200 రౌండ్ల కాల్పులు..!
Admin - September 16, 2020 / 09:42 AM IST

భారత్, చైనా దేశాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారాయి. అయితే ఇప్పటికే ఇరు దేశాల సరిహద్దుల్లో సైన్యాలు పలు ఘర్షణలు కూడా చేసుకున్నాయి. తాజాగా మరో సారి ఇరు దేశాలు సై అంటే సై అన్నాయి. అయితే భారత్ లో ఉన్న కీలకమైన బ్లాక్‌టాప్ శిఖరాన్ని స్వాధీనం చేసుకొన్నాక పాంగాంగ్ సరస్సు వద్ద చాలా కీలక పరిణామాలు చోటుచేసుకొన్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే సరస్సు దక్షిణ దిక్కున ఉన్న భారత్ ఆధిపత్యం ప్రదర్శించడంతో చైనా సైనిక దళాలు ఉత్తర దిక్కున దురుసుగా వ్యవహరించడం మొదలు పెట్టాయి. అయితే సెప్టెంబర్ 7వ తేదీన చుషుల్ సెక్టర్ లో ఇరు దేశాల సైన్యాలు హెచ్చరికగా చేసిన కాల్పుల కంటే ఈ ఘటన తీవ్రమైనదని తెలిపారు. కానీ ఫింగర్ 3,4 వద్ద ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకూ భారత్ చైనా సైన్యాలు ఎటువంటి ప్రకటన చేయలేదు.