Train : రైలులో మంట‌లు.. ఒక్క‌సారిగా భ‌యంతో ప‌రుగెత్తిన ప్ర‌యాణికులు

NQ Staff - July 3, 2022 / 12:00 PM IST

Train  : రైలులో మంట‌లు.. ఒక్క‌సారిగా భ‌యంతో ప‌రుగెత్తిన ప్ర‌యాణికులు

Train  : యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. దక్షిణ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలో మంటలు చెలరేగాయి. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళుతున్న రైలు చివరి బోగీలో మంటలు చెలరేగాయి. భువనగిరి దగ్గరలో పగిడిపల్లి వద్ద శనివారం అర్థరాత్రి ఈ మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన సిబ్బంది వెంటనే డ్రైవర్ ను అప్రమత్తం చేయడంతో రైలును నిలిపేశారు.

పెను ప్రమాదం

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అయితే ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరుగలేదని అధికారులు వెల్లడించారు. కాగా, పార్శిల్‌ బోగీలు మంటలు అంటుకోవడంతో మిగిలిన బోగీల్లో ఉన్న ప్రయాణికులు రైలు దిగి పరుగులు పెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Fire Broke Last Bogi Train Going From Secunderabad Delhi

Fire Broke Last Bogi Train Going From Secunderabad Delhi

ఈ ఘటనలో లగేజీ బోగీలో స్వల్ప ఆస్తినష్టం జరిగినట్లు గుర్తించారు. మంటలు చెలరేగిన సమయంలో రైలు ఆగకుండా వెళ్తే పెనుప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తానికి ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందగానే సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైల్లో సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరు కోవ‌డం, సమీప ప్రాంతాల నుంచి అగ్నిమాపక శకటాలు రప్పించి మంటలను ఆర్పివేయ‌డంతో పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us