శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

Advertisement

శ్రీశైలం ఎడమ జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తెలంగాణ జెన్‌కో మొదటి యూనిట్‌లో ఓ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్యూట్ అవ్వడంతో మంటలు చెలరేగాయి. అలాగే పెద్ద పెద్ద శబ్దాలతో భారీగా పేలుళ్లుతో మంటలు సంభవించాయి. పవర్ హౌస్ మొత్తం కూడా దట్టమైన పొగ అలుముకుంది. దీనితో కొంతమంది టీఎస్ జెన్‌కో ఉద్యోగులు దాంట్లోనే చిక్కుకుపోయారు. అయితే ప్రమాద సమయంలో విద్కుత్ కేంద్రంలో 17 మంది ఉన్నట్లు తెలుస్తుంది.

దాంట్లో 8 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. అలాగే మిగితా 9 మంది దాంట్లోనే ఉన్నారు. దీనితో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వారిని కాపాడేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. అలాగే సహాయక చర్యలలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గవ్వల బాలరాజు దగ్గరుండి సమీక్షించారు. ఈ ఘటన పట్ల మంత్రి జగదీష్ రెడ్డి ద్రిగ్బంతి వ్యక్తం చేసాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here