రష్యాలో భారీ అగ్నిప్రమాదం

Advertisement

ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రమాదాలు బారిన జరుగుతున్నాయి. తాజాగా రష్యా దేశంలోని ఓ పెట్రోల్‌ బంక్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ అగ్ని ప్రమాదంలో 12 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. రష్యాలోని వోల్గోగ్రాడ్‌ పెట్రోల్‌ స్టేషన్‌లో మంటలు చెలరేగడంతో వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుంది.

ఆ మంటలలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దీనితో పెట్రోల్ ట్యాంకర్ కనిపించకుండా పోయింది. ఆ పెట్రోల్‌ స్టేషన్‌కు సంబంధించిన పైప్‌లైన్లు అన్ని కూడా పేలడంతో చుట్టుపక్కల సుమారు 200 మీటర్ల వరకు మంటలు సంభవించాయి. దీనితో ఆ ప్రాంతమంతా పొగ తో నిండిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here