విజయవాడ కోవిడ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.10 మంది మృతి

Admin - August 10, 2020 / 05:09 AM IST

విజయవాడ కోవిడ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.10 మంది మృతి

గుజరాత్ కోవిడ్ ఆసుపత్రిలో మొన్న ఘోరమైన ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే.. ఆ విషయం మరవకముందే తాజాగా విజయవాడ కోవిడ్ కేర్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్ గా రమేశ్ ఆసుపత్రి సెంటరుగా హోటల్ స్వర్ణ ప్యాలస్ ను వినియోగిస్తున్నారు. అయితే దింట్లో నలభై మంది వరకు కోవిడ్ బాధితులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఆసుపత్రిలో ఈ రోజు తెల్లవారుజామున భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదానికి గల కారణం షార్ట్ సర్క్యూట్ అయినట్లు భావిస్తున్నారు.

కోవిడ్ బాధితులు నిద్రలో ఉండటంతో ప్రమాదం జరిగిన వెంటనే స్పందించే విషయంలో ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ రావడంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో భవనంలో ఉన్న వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మొదటగా గ్రౌండ్.. ఫస్ట్ ఫోర్లలో మంటలు సంభవించాయి. అలాగే ఇతర అంతస్తులకు పొగ వ్యాపించింది. ఒకవైపు ప్రాణాల్ని కాపాడుకోవటం కోసం.. కొందరు ఒకటో అంతస్తు నుంచి కిందకు దూకినారు. మరికొందరిని కిటికీ అద్దాలు పగలగొట్టి నిచ్చెనల ద్వారా అగ్నిమాపక సిబ్బంది బాదితులను కిందకు దింపింది.

అయితే ఈ ఘటనలో 30 మంది కోవిడ్ బాధితులు ఉన్నారు. అలాగే ఇప్పటివరకు పది మంది మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే 18 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరి ఆచూకీ డొరొకడం లేదు. వారి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us