బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు

Advertisement

తమిళనాడు రాష్ట్రంలోని ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. వివరాల్లోకి వెళితే కడలూరు జిల్లాలోని కట్టుమన్నార్‌ కోయిల్‌ గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. ఇక ఈ ప్రమాదంలో మృతులంతా కూడా మహిళలే అని అధికారులు వెల్లడించారు. ఘటన జరిగిన స్థలంలో ఐదుగురు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందినట్లు తెలిపారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

అలాగే ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు. ఇక ఈ ప్రమాదంలో కర్మాగారం యజమాని కూడా మృతి చెందినట్లు గుర్తించారు. ఈ కర్మాగారానికి అనుమతులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మృతులంతా దాంట్లో పనిచేసే వారే అని వివరించారు. అయితే ఇక్కడ అనుమతి పొందిన రసాయనాలే వాడుతున్నారా.. లేదా అనే అంశంపై దర్యాప్తు చేపడుతున్నామని వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here