కరీంనగర్ లో భారీ అగ్ని ప్రమాదం

Advertisement

కరీంనగర్ జిల్లలో ట్రాన్స్ కో సబ్ స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఎలక్ట్రిసిటీ క్యాంపస్ లోని స్పోర్ట్స్ సెంటర్ దగ్గర లో మంటలు చెలరేగాయి. అయితే అక్కడే ఉన్న కొన్ని కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌లు అగ్నికి కాలిపోయాయి. ఇక ఈ ప్రమాదానికి కల కారణాలు స్పష్టంగా తెలియడం లేదు. దీనితో కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు సంభవించినట్లు భావిస్తున్నారు. ఇక ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకుకొచ్చారు. కానీ జరగవలసిన నష్టం మొత్తం జరిగిపోయింది. ఎలక్ట్రిసిటీ స్టోర్ రూమ్ దగ్గర ఉన్న విద్యుత్ వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్ అయి దానితో మంటలు చెలరేగినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఘటన స్థలానికి మంత్రి గంగుల కమలాకర్ కలెక్టర్ శశాంక, సిపి కమలాసన్ రెడ్డి సందర్శించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here