ఇలాంటి చీప్ శిక్షలు వేస్తే ఎవ్వరైనా తప్పులు చేస్తారు జడ్జిగారు..!
Ajay G - January 1, 2021 / 06:11 PM IST

ఏపీ హైకోర్టులో తాజాగా విచిత్ర ఘటన చోటు చేసుకున్నది. ఏపీ శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు వేసిన శిక్ష ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశమైంది. శాసనసభ కార్యదర్శికి కోర్టు 1000 రూపాయలు జరిమానా విధించడంతో పాటు.. పనిగంటలు ముగిసేవరకు కోర్టు హాలులోనే కూర్చోవాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ 1000 రూపాయలు చెల్లించలేకపోతే.. వారం రోజుల పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని హైకోర్టు స్పష్టం చేసింది.

fine to ap legislative assembly secretary
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్.. ఈ తీర్పును వెలువరించారు. కోర్టు ధిక్కరణ కేసులో దాఖలు అయిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈ శిక్ష వేయడం గమనార్హం.
నిజానికి.. ఆయనకు ముందుగా నెల రోజుల పాటు సాధారణ జైలు శిక్షను, వెయ్యి రూపాయల జరిమానాను జడ్జి విధించారు. కానీ.. తనకు వయసు మీదపడిందని.. అన్ని రోజులు జైలులో గడపలేనని శాసనసభ కార్యదర్శి కోర్టుకు విన్నవించుకోవడంతో… శిక్షను తగ్గించారు.
అసలు ఏం జరిగిందంటే… శాసనసభలో పనిచేసే ఉద్యోగులకు ఇచ్చే ఇంక్రిమెంట్లు, జీతాల గురించి 2017 లో హైకోర్టు కొన్ని ఉత్తర్వులను జారీ చేసింది. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత శాసనసభ కార్యదర్శిది. కానీ.. అప్పుడు హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో… దానిపై విచారణ చేపట్టిన కోర్టు.. కోర్టు ధిక్కరణ కింద తాజాగా ఈ తీర్పును వెలువరించింది.