ఐపీల్ స్పాన్సర్ షిప్ నుండి తప్పుకున్న వివో

Advertisement

ఈ ఏడాది సమ్మర్ లో జరగవలిసిన ఐపీల్ కరోనా దెబ్బకు వాయిదా వేశారు. దీనితో సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు యూఏఈలో ఈ లీగ్‌ జరగనుంది. అయితే ఈ లీగ్ కు గత కొన్ని సంవత్సరాలుగా చైనా కి చెందిన వివో కంపెనీ స్పాన్సర్ షిప్ గా కొనసాగుతుంది. అయితే తాజాగా చైనా, భారత్ కు జరిగిన వివాదం తో చైనా కి చెందిన అన్ని కంపెనీలను కూడా బ్యాన్ చేసింది భారత్ సర్కార్. ఇదే నేపథ్యంలో వివో ను కూడా బ్యాన్ చేసారు. కానీ ఈ ఏడాది జరగవలిసిన ఐపీల్ లీగ్ కు మాత్రం వివో స్పాన్సర్ షిప్ కొనసాగుతుందని తెలిపారు.

దీనితో సోషల్ మీడియాలో నెటిజన్లు వివో ను తీసివేయాలని తీవ్రంగా విమర్శలు కురిపించారు. దీనితో ఆ వివర్శలు తట్టుకోలేక తామే స్వచ్చందంగా తప్పుకుంటున్నం అని వివో యాజమాన్యం తెలిపింది. కానీ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను వివో ఇండియా ఐదేళ్లకు గానూ 2017లో రూ. 2199 కోట్లకు సొంతం చేసుకుంది. ప్రతీ లీగ్‌లో రూ.440 కోట్లు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. దేశమంతా చైనా కంపెనీలపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నా బీసీసీఐ మాత్రం వివోను కొనసాగించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ తక్కువ సమయంలో మరో కంపెనీ స్పాన్సర్ గా దొరకడం కష్టమని బీసీసీఐ చెప్తుంది. దీనితో ఐపీఎల్ 2020కి త్వరలో కొత్త కంపెనీ స్పాన్సర్ చేయనుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here