Bigg Boss House : ఫినాలే టాస్క్ స్టార్ట్.. శివాజీ, ప్రియాంక, శోభాశెట్టి ఫైనల్ ఆశలు గల్లంతు..!

NQ Staff - November 29, 2023 / 11:53 AM IST

Bigg Boss House : ఫినాలే టాస్క్ స్టార్ట్.. శివాజీ, ప్రియాంక, శోభాశెట్టి ఫైనల్ ఆశలు గల్లంతు..!

Bigg Boss House :

బిగ్ బాస్ సీజన్-7 చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. దాంతో హౌస్ లో ఉన్న వారి మీద ఒత్తిడి బాగానే పెరుగుతుంది. ఒక్కొక్కొరు టెన్షన్ తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం హౌస్ లో 8 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో టాప్-5లోకి వెళ్లడానికి ఫినాలే రేస్ ను కూడా స్టార్ట్ చేశారు. కొత్త టాస్క్ లతో కఠినమైన చాలా సీరియస్ పరీక్షలు పెడుతున్నారు బిగ్ బాస్. ఇంకేముంది హౌస్ మొత్తం రణరంగంలా మారిపోయింది. చావోరేవో అన్నట్టు ఆడుతున్నారు కంటెస్టెంట్లు. అయితే దానికంటే ముందు రోజు జరిగిన నామినేషన్ల పర్వంలో ఎవరికి వారే గ్రూపులుగా విడిపోయి మాట్లాడుకున్నారు.

అయితే అమర్ ప్రవర్తనతో శివాజీకి చిరాకు వచ్చిపడింది. వెంటనే బయటకు వెళ్తే బాగుండు అనుకుంటూ విసిగిపోయాడు. అంతే కాదండోయ్.. వెంటనే తనను బయటకు పంపించేయాలంటూ వేడుకున్నాడు ప్రేక్షకులను. అయితే టాప్ -5లోకి వెళ్లే మొదటి వ్యక్తి కోసం టాస్కులు మొదలు పెట్టాడు బిగ్ బాస్. ఈ రోజు రెండు టాస్కులతో ప్రారంభించాడు బిగ్ బాస్. అయితే ఈ టాస్క్ లో పాల్గొని ఎలాగైనా గెలవాలి అనుకున్న ప్రియాంక, శోభాశెట్టి, శివాజీ లకు నిరాశే ఎదురైంది. ఎందుకంటే వీరు ముగ్గురూ రెండు టాస్క్ లలో మొదటి రౌండ్ లోనే వెనుతిరిగారు.

ఈ టాస్క్ లో గెలిచిన అమర్ కు శోభా, ప్రియాంక, శివాజీ తమ పాయింట్లను ఇవ్వాల్సి వచ్చింది. ఇంకేముంది అమర్ దీప్ అందరికంటే టాప్ లోకి వెళ్లిపోయాడు. ఇక శోభాశెట్టి తాను గేమ్ నుంచి ఎగ్జిట్ అయినందుకు ఏడుస్తూ ఉండిపోయింది. దాంతో ప్రియాంక, పల్లవి ప్రశాంత్ వచ్చి ఆమెను ఓదార్చారు. ఇక జరుగుతున్న టాస్క్ లో మీద నిన్న అర్థరాత్రి వరకు డిస్కషన్స్ జరిపారు కంటెస్టెంట్లు. ఇంకో విషయం ఏంటంటే అర్థరాత్రి వరకు ఫినాలేకు సంబంధించిన టాస్క్ లు జరుగుతున్నాయి. కాగా టాస్క్ లో అందరూ ఓడిపోతుండగా.. అమర్, ప్రియాంకలు మాత్రమే పోటీ పడ్డారు.

 Finale Task Started In Bigg Boss House

Finale Task Started In Bigg Boss House

ఇద్దరూ బాల్ కోసం పోట్లాడుకునే దాకా వెళ్లిపోయారు. ప్రియాంక ఎంత బతిమాలినా సరే వినలేదు అమర్ దీప్. ఆమె చేతిలో ఉన్న బాల్ ను లాక్కునే ప్రయత్నం చేశాడు. దాంతో ఆమె అమర్ దీప్ ను కొరికింది. అయినా సరే అమర్ దీప్ మాత్రం వినలేదు. ఆమె చేతిలో ఉన్న బాల్ ను లాక్కుని టార్గెట్ ను కంప్లీట్ చేస్తాడు. అయితే తాను కష్టపడ్డా సరే ఫలితం లేదని ప్రియాంక బాధపడుతుంది.

అయితే అమర్ దీప్ వచ్చి ప్రియాంకకు సారీ చెబుతాడు. ఆమెను ఓడించినందుకు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ప్రస్తుతం హౌస్లో శివాజీ, ప్రశాంత్, అమర్, శోభ, ప్రియాంక, అర్జున్, యావర్, గౌతమ్ మాత్రమే మిగిలారు. వీరిలో 7 గురు నామినేషన్స్ లో ఉన్నారు. అమర్ మినహాయించి అందరు నామినేట్ అయ్యారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us