డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సిందే: యూజీసీ

Advertisement

ఢిల్లీ: ప్రపంచం మొత్తం కరోనా కారణంగా లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. కనీసం నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కూడా భయపడేంతగా కరోనా ప్రస్తుతం దేశంలో విజృంభిస్తుంది. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో యూజీసీ తీసుకున్న నిర్ణయం దేశ ప్రజలను ఒకింత ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు ఖచ్చితంగా నిర్వహించాలని యూజీసీ ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 30 నాటికి డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారికి పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. పరీక్షలు నిర్వహించకపోతే ఆ డిగ్రీలు చెల్లవని అధికారులు తెలిపారు.

యూజీసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ, మహారాష్ట్ర విశ్వవిద్యాలయాలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. . ఈ అంశంపై విచారణను జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం చేపట్టింది.ఈ నేపథ్యంలో, పరీక్షలను రద్దు చేయటం విద్యార్థులకు మేలు చేయదని.. యూజీసీ తరపున సొలిసిటర్ జనరల్‌ తుషార్‌ మెహతా సర్వోన్నత న్యాయస్థానానికి నేడు విన్నవించారు. కాగా, కమిషన్‌ నిర్ణయం రాజ్యాంగం, చట్టానికి అనుగుణంగా లేదని ఆయా విశ్వవిద్యాలయాలు వాదించాయి. ఈ అంశంపై ప్రత్యుత్తరమిచ్చేందుకు కమిషన్‌కు వ్యవధినివ్వాల్సిందిగా తుషార్‌ మెహతా కోర్టును కోరారు. ఇందుకు సమ్మతించిన సర్వోన్నత న్యాయస్థానం, కేసు విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here