Bigg boss 4: వీళ్లేంట్రా బాబు.. చిన్నపిల్లల్లా కొట్టుకుంటున్నారు?

Ajay G - November 10, 2020 / 06:35 PM IST

Bigg boss 4: వీళ్లేంట్రా బాబు.. చిన్నపిల్లల్లా కొట్టుకుంటున్నారు?

ఏందో మరి.. బిగ్ బాస్ హౌస్ మరీ చిన్నపిల్లల హౌస్ లా మారిపోయింది. ప్రతి విషయానికి కంటెస్టెంట్లు చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తున్నారు. చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేస్తూ… భూతద్దంలో పెట్టి చూస్తూ.. రచ్చ రచ్చ చేస్తున్నారు. ఎవ్వరూ తక్కువ తినలేదు. అందరూ అందరే.

fight between sohel and akhil in captaincy task

fight between sohel and akhil in captaincy task

ముఖ్యంగా సోహెల్, అఖిల్ అయితే.. చెప్పక్కర్లేదు. టామ్ అండ్ జెర్రీలా ప్రతి విషయానికి కొట్టుకుంటున్నారు. ఐదు నిమిషాలు కొట్టుకుంటారు.. ఐదు నిమిషాలు క్లోజ్ గా ఉంటారు. ఏంటో వీళ్లు. నిజానికి సోహెల్, మెహబూబ్ ఎంత క్లోజో… అఖిల్, సోహెల్ కూడా అంతే క్లోజ్. సోహెల్, అఖిల్ ఈ మధ్య బాగా క్లోజ్ అయ్యారు.

అయినప్పటికీ.. చిన్న చిన్న విషయాలకు ఇంకా గొడవ పడుతూనే ఉన్నారు. తాజాగా కెప్టెన్సీ టాస్క్ ను బిగ్ బాస్ ఇచ్చాడు. అందులో కూడా కొట్టుకోవడాలే. వీళ్లసలు మారరా? కొంచెం కూడా. సోహెల్, మెహబూబ్, అఖిల్.. ముగ్గురూ టాస్క్ విషయంలో గొడవ పడ్డారు. ఇక చూసుకోండి.. ఒకరిని మించి ఇంకొకరు.. చాలా ఫైర్ అయిపోయారు. అసలు ఏం జరుగుతోందో కూడా అర్థం కాలేదు.

దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. కెప్టెన్సీ టాస్క్ కోసం కూడా కంటెస్టెంట్లు బాగానే కష్టపడ్డారు. ఆఖరి బంతి అనే టాస్క్ ను బిగ్ బాస్ ఇచ్చాడు. ఈ టాస్కులేమో కానీ… కంటెస్టెంట్లు మాత్రం కొట్టుకునేటట్టే ఉన్నారు.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us