Messi : ఫిఫా హీరో మెస్సీ అస్సోంలో పుట్టాడా?
NQ Staff - December 19, 2022 / 10:21 PM IST

Messi : ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ 2022 విజేతగా అర్జెంటీనా నిలిచింది. ఆ జట్టు ఆటగాడు లియోనల్ మెస్సీ అద్భుతమైన ఆట తీరు తో ఫుట్ బాల్ వరల్డ్ కప్ సాధించేలా చేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫుట్ బాల్ అభిమానులకు మెస్సీ ఒక దేవుడు అనడంలో సందేహం లేదు.
వరల్డ్ కప్ పూర్తయిన తర్వాత కూడా మెస్సీ నామస్మరణ ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతూనే ఉంది. ఫుట్ బాల్ అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా ఇప్పుడు మెస్సీ గురించి సోషల్ మీడియాలో తెగ చూస్తున్నారు.. చదువుతున్నారు.
ఈ సమయంలో మన ఇండియన్ పొలిటిషన్ ఒకరు మెస్సీ మన ఇండియాలో పుట్టాడు అంటూ చేసిన ట్వీట్ వైరల్ అయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే అస్సాం కు చెందిన కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖలీక్ ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో గెలిచినందుకుగాను మెస్సీ ని అభినందిస్తూ మీకు అస్సోం తో సంబంధం ఉన్నందుకు గర్విస్తున్నాం అన్నాడు.
అందుకు ఒక నెటిజన్ స్పందిస్తూ మెస్సి కి అస్సోంతో సంబంధం ఏంటి అంటూ ప్రశ్నించాడు. అప్పుడు మంత్రి మెస్సీ అస్సాంలో జన్మించాడు అంటూ మరో ట్వీట్ చేశాడు. ఈ రెండు ట్వీట్స్ కూడా ఆ తర్వాత డిలీట్ చేయడం జరిగింది.
ఫేక్ న్యూస్ చూసి ఎంపీ గారు మెస్సీ అస్సాంలో జన్మించాడని తప్పుగా భావించాడు. అందుకే తన తప్పును తెలుసుకొని ట్వీట్స్ ను డిలీట్ చేయడం జరిగింది. అప్పటికే చాలా మంది స్క్రీన్ షాట్స్ తీసుకోవడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. మంత్రి గారి యొక్క అవివేకానికి విమర్శలు ఎదుర్కొన్నాడు.