Virat Kohli And Sourav Ganguly : సౌరవ్ గంగూలీని అన్ ఫాలో చేసిన కోహ్లీ.. పెరుగుతున్న వైరం..!
NQ Staff - April 18, 2023 / 09:20 AM IST

Virat Kohli And Sourav Ganguly : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ మధ్య రోజురోజుకూ వైరం పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఐపీల్ మ్యాచ్ ల సందర్భంగా ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ నుంచే ఇద్దరి నడుమ గ్యాప్ బాగా పెరిగిపోతోంది. గంగూలీ ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ గా ఢిల్లీ క్యాపిటల్స్ కు పని చేస్తున్నారు. ఇటు ఆర్సీబీ తరఫున కోహ్లీ ఆడుతున్నారు.
మొన్న జరిగిన మ్యాచ్ అనంతరం ఇద్దరూ షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేదు. పైగా గంగూలీని కోహ్లీ చాలా సీరియస్ గా చూసిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. దీన్ని బట్టి ఇద్దరి నడుమ గ్యాప్ బాగా పెరిగిందనే చెప్పుకోవాలి. ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్ కోహ్లీతో మాట్లాడుతున్నప్పుడు గంగూలు క్యా మధ్యలో నుంచి జంప్ కావడం కూడా చేశాడు.

Feud Between Virat Kohli And Sourav Ganguly Increasing
వాస్తవానికి వీరిద్దరికీ గతంలో నుంచే అస్సలు పడట్లేదు. గంగూలు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే కోహ్లీ కెప్టెన్సీని కోల్పోయాడు. ఇదే ఇద్దరి మధ్య మనస్పర్థలకు కారణమై ఉండొచ్చని సమాచారం. అయితే దీనిపై క్రికెటర్ల నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఇక తాజాగా కోహ్లీ గంగూలీని అన్ ఫాలో చేశాడు.
గంగూలీ కూడా కోహ్లీని ఫాలో కావట్లేదని తెలుస్తోంది. ఇలా ఇద్దరి నడుమ గ్యాప్ బాగానే పెరిగిపోతోంది. ఇప్పుడు ఈ ఇద్దరి నడుమ ఏం జరుగుతుందనేది అస్సలు అర్థం కావట్లేదు. తన కెప్టెన్సీ పోవడానికి గంగూలీనే కారణం అని కోహ్లీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి వీరిద్దరి మధ్య గ్యాప్ ఇంకా ఎంత దూరం వెళ్తుందో.
The way Virat Kohli looked at ganguly pic.twitter.com/pLoAzyn9EI
— itz_mksoni25 (@_itz_mksoni25) April 17, 2023
#RCBvDC is this kohli vs ganguly??? pic.twitter.com/bZIUwvmt1K
— saravana guru (@saravanaguru8) April 15, 2023