Fertility time : తల్లి గర్భంలో ఉన్నప్పుడే రుచికి తగ్గట్లుగా ఫేస్‌ మార్పు

NQ Staff - September 24, 2022 / 11:14 AM IST

Fertility time : తల్లి గర్భంలో ఉన్నప్పుడే రుచికి తగ్గట్లుగా ఫేస్‌ మార్పు

Fertility time: చిన్న పిల్లలకు జంక్ ఫుడ్స్ అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది.. చాక్లెట్స్, బిస్కెట్స్ తిన్నంత ఇష్టంగా పచ్చి కూరగాయలు లేదంటే బలవర్ధకమైన ఆహార పదార్థాలు తినేందుకు వారు ఆసక్తి చూపించరు అనే విషయం తెల్సిందే.

Fertility time Baby Identifies Food

Fertility time Baby Identifies Food

ఆకు కూరలను మరియు ఇతర ఉడక బెట్టిన కూరగాయలను తినేందుకు వారు అస్సలు ఆసక్తి చూపించరు. పెద్ద వారు ఇష్టం లేక పోయినా ఏదో రకంగా తింటారు, కానీ చిన్నపిల్లలు మాత్రం వారి ముందు ఆకు కూరలు లేదా కూరగాయలు పెట్టగానే మొహం చిట్లింటచుకున్నట్లుగా చూస్తారు.

చిన్న పిల్లలు మాత్రమే కాకుండా కడుపులో ఉన్న సమయంలోనే అలాంటి ఆహార పదార్థాలకు మొహం చిట్లించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లాండుకు చెందిన శాస్త్రవేత్తలు తల్లి గర్భంలో ఉండగానే పిల్లలు ఆహార పదార్థాల పట్ల స్పందిస్తారని తేల్చారు.

తల్లి తీసుకునే ఆహారం ఆధారంగానే చాలా మంది కడుపులో ఉన్న పిల్లలు ముహ కవళికలు మారుతున్నాయని వారు కనిపెట్టారు. వంద మంది మహిళలపై ఈ ప్రయోగం నిర్వహించి వారిలో కొంత మందికి క్యాబేజీతో తయారు చేసిన క్యాప్సిల్స్.. కొంత మందికి క్యారెట్ తో తయారు చేసిన క్యాప్సిల్స్ ఇచ్చారు.

కొంత మందికి ఏమీ ఇవ్వకుండా ఉంచారు. వారందరినీ క్యాప్సిల్స్ తీసుకున్న తర్వాత స్కాన్ చేయగా క్యారెట్ తీసుకున్న మహిళల గర్భంలో ఉన్న పిల్లల మొహాలు చిరునవ్వుతో కనిపించగా క్యాబేజీ క్యాప్సిల్స్ తీసుకున్న వారి మొహాలు చిట్లించుకున్నట్లుగా అసహ్యంగా చూస్తున్నట్లుగా కనిపించారు. దీన్ని బట్టి తల్లి గర్భంలో ఉండగానే పిల్లలు ఆహారపు అలవాట్లకు అలవాటు అవుతున్నారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us