Health Tips : షుగర్ నుంచి గుండె జబ్బులను తగ్గించడం వరకు.. మెంతికూరతో ఇన్ని ఉపయోగాలా..!

NQ Staff - November 19, 2023 / 06:14 PM IST

Health Tips : షుగర్ నుంచి గుండె జబ్బులను తగ్గించడం వరకు.. మెంతికూరతో ఇన్ని ఉపయోగాలా..!

Health Tips :

చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. అయితే ఆరోగ్యం కోసం ఎన్నో ఔషధాల కూరగాయాలు ఉంటాయి. కానీ మెంతికూర గురించి చాలామందికి తెలియదు. వాస్తవానికి మెంతికూరతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. వీటితో ఎన్నో రకాల రుచికరమైన వంటలు చేసుకోవచ్చు. దాంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఈ కూర. ఇదే విషయాన్ని డాక్టర్లు సైతం చెబుతున్నారు. అయితే ఇప్పుడు మెంతికూరతో ఉన్న ఉపయోగాలను తెలుసుకుందాం.

బరువు తగ్గడం కోసం..

ఈ జనరేషన్ లో చాలామంది ఫిజికల్ గా కష్టపడలేకపోతున్నారు. దాంతో ఈజీగా బరువు పెరుగుతున్నారు. కాగా ఇలా బరువు పెరిగాక తగ్గేందుకు ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఇలాంటి వారు మెంతి కూరను తింటే చాఆ సులువుగా బరువును తగ్గిస్తుంది. ఈ ఆకులు బరువును తగ్గించడంలో ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కాబట్టి వీటిన వారంలో రెండు సార్లు అయినా డైట్ లో చేర్చుకుంటే ఎంతో మేలు చేస్తాయి.

బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడంలో..

ప్రస్తుత కాలంలో చాలామంది షుగర్ తో బధపడుతున్నారు. ఇది దీర్ఘకాలిక వ్యాధి. దాన్ని తగ్గించుకోవడం కోసం హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతుంటారు. కానీ దాన్ని తగ్గించి షుగర్ లెవల్స్ ను నార్మల్ గా ఉంచడంలో మెంతికూర బాగా ఉపయోగపడుతుంది. బ్లడ్ లో షుగర్ ను సమాంతరంగా ఉంచే గుణం మెంతికూరలో ఉంది.

జీర్ణ ప్రక్రియ..

జీర్ణ సంబంధిత సమస్యలతో కూడా ఎంతో మంది బాధపడుతున్నారు. అలాంటి వారికి మెంతికూరతో ఎంతో ఉపయోగాలు ఉన్నాయి. మెంతి కూరను వారంలో ఒకసారి తిన్నా సరే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం అస్సలు ఉండదు. మెంతి ఆకుల్లో అజీర్ణం, ఇన్ ఫ్లమేషన్ లాంటి సమస్యలను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతాయి. ఇది ప్రేగు కదలికలు చురుగ్గా ఉంచుతుంది.

గుండె ఆరోగ్యం

బల్డ్ లో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో మెంతి కూర బాగా ఉపయోగపడుతుంది. దీన్ని తినడం వల్ల గుండె జబ్బులు పూర్తిగా తగ్గిపోతాయి. శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించడానికి కూడా బాగానే ఉపయోగపడుతుంది మెంతి కూర. ఇందులో ఉండే విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు లాంటి యాంటీఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతాయి.

ఇమ్యూనిటీ పవర్..

మెంతి ఆకుల్లో ఉండే విటమిన్లు, మినరల్స్ అన్నీ ఇమ్యూనిటీ పవర్ ను బాగా పెంచుతాయి. చలి కాలంలో మెంతికూరను తినడం వల్ల రోగాలకు దూరంగా ఉంచుతుంది. దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. కాబట్టి మీ డైట్ లో మెంతికూరను చేర్చుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us