Covid : కోవిడ్ కొత్త వేరియంట్లొస్తున్నాయ్..! రెండేళ్ళ క్రితం నాటి భయాందోళనలు మళ్ళీ.!
NQ Staff - December 20, 2022 / 09:24 PM IST

Covid : కోవిడ్ మహమ్మారి మళ్ళీ ప్రపంచం నెత్తిన పిడుగులా పడబోతోంది. వాస్తవానికి, ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ ఏమీ అదుపులోకి వచ్చేయలేదు. కాకపోతే, వ్యాక్సిన్లు అందుబాటులో వున్నాయి గనుక, కాస్త ధైర్యం అంతే.
కరోనా వైరస్ పుట్టిన నేలగా భావిస్తోన్న చైనాలో అయితే, కోవిడ్ కేసులు అదుపులో వుండడంలేదు. అక్కడ కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. అక్కడి వ్యాక్సిన్లకు కోవిడ్ లొంగడంలేదు. ఈ క్రమంలో కొత్త వేరియంట్లూ పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా ఆందోళన చెందుతోంది.
రాష్ట్రాల్ని అప్రమత్తం చేసిన కేంద్రం..
కోవిడ్ అనుమానిత లక్షణాలతో బాధపడుతున్నవారికి వైద్య పరీక్షలు చేయాలనీ, జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తే వేరియంట్ల వ్యవహారం బయటకు వస్తుందని రాష్ట్రాలకు కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. చైనాతోపాటు బ్రెజిల్, అమెరికా, కొరియా, జపాన్ దేశాల్లోనూ కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.
ఇదిలా వుంటే, ప్రజలూ అప్రమత్తంగా వుండాలనీ, కోవిడ్ విషయమై తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతోపాటు, మాస్కులు ధరించడం మేలని కేంద్రం సూచిస్తోంది.
అయితే, రెండేళ్ళ క్రితం నాటి భయాందోళనలు మళ్ళీ వస్తాయా.? అని ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి.