Uttar Pradesh: క‌న్న కూతురిని ట్రాప్ చేసి, వ్య‌భిచారం చేయించిన క‌సాయి తండ్రి

Uttar Pradesh: ఇటీవ‌లి కాలంలో క‌న్నతండ్రే క‌ర్క‌శ‌త్వం చూపిస్తూ క్రూరంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. కూతుళ్ల‌పై అత్యాచారాలు చేస్తూ స‌భ్య‌స‌మాజం సిగ్గుప‌డేలా చూస్తున్నారు. తాజాగా ఓ తండ్రి కూతురిని లోబ‌ర‌చుకొని ఆ త‌ర్వాత ఆమెను ప‌లువురు బ‌డా బాబులు ద‌గ్గ‌ర‌కు పంపాడు. కొన్నేళ్లుగా వాళ్లు తనపై అత్యాచారం చేసినట్టుగా చెబుతోంది బాలిక. ఆమె ఫిర్యాదు మేరకు.. లలిత్‌పూర్ పోలీసులు 28 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Father Threatens His Daughter about Not to Reveal Rape in Uttar Pradesh
Father Threatens His Daughter about Not to Reveal Rape in Uttar Pradesh

నిందితుల‌లో బాలిక తండ్రి, సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిలక్ యాదవ్, ఆ పార్టీ సిటీ అధ్యక్షుడు రాజేష్ జైన్ జోజ్‌హియా, బహుజన్ సమాజ్ పార్టీ దీపక్ అహిర్వార్ పేర్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనమైంది. తండ్రి.. కూతురికి రోజూ అసభ్యకరమైన చిత్రాలు చూపించేవాడు. పలుమార్లు లైంగికంగా లొంగదీసుకోవడానికి ప్రయత్నించేవాడు. ఓ రోజు బైక్‌పై బయటకు తీసుకెళ్లి.. బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ విషయం బయటకు చెబితే.. బాలిక తల్లిని చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో ఓ రోజు హోటల్‌కు తీసుకెళ్లి, బాలికను మహిళకు అప్పగించాడు. ఆమె బాలికకు మత్తుమందు ఇచ్చి.. పలువురితో అత్యాచారం చేయించేది. ఇలా కొత్త కొత్త వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, దీంతో తాను తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డానని బాధితురాలు వాపోయింది. తన బంధువులు కూడా తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది.

ఈ సంఘ‌ట‌న‌పై లలిత్‌పూర్ ఎస్పీ నిఖిల్ పతక్ మాట్లాడుతూ.. ఈ కేసును తాము సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిపారు. బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించినట్లు చెప్పారు. బుధవారం మేజిస్ట్రేట్ సమక్షంలో బాలిక స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నట్లు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదుపై తిలక్ యాదవ్‌.. ప్రకటన విడుదల చేశారు. తనని, తన సోదరులను కావాలనే కేసులో ఇరికిస్తున్నారని పేర్కొన్నారు.