Prakasham: కూతురికి మద్యం తాగించి ప్రియురాలి సాయంతో అత్యాచారం చేసిన తండ్రి
NQ Staff - October 4, 2021 / 10:24 AM IST

Prakasham: మహిళలపై, అన్యం పుణ్యం ఎరుగని చిన్నారులపై అత్యాచారాలు జరుగుతుండడం కలవర పెట్టిస్తుంది. ఇటీవల జరిగిన చిన్నారి ఘటన ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది.మహిళలపై, అన్యం పుణ్యం ఎరుగని చిన్నారులపై అత్యాచారాలు జరుగుతుండడం కలవర పెట్టిస్తుంది. ఇటీవల జరిగిన చిన్నారి ఘటన ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది. సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఈ నెల 12వ తేదీన జరిగిన చిన్నారి రేప్ అండ్ మర్డర్ కేసు సంచలనం రేపగా, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ వచ్చింది.కాని చివరకు అతను ఆత్మహత్య చేసుకొని చచ్చాడు.

Father Molested Her Daughter in Prakasham District
ఎంత కఠిన శిక్షలు అమలు చేసినా కూడా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. కన్న కూతురిపై తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు.. ప్రియురాలితో వీడియో తీయించి రాక్షసానంధం పొందాడు. ప్రకాశం జిల్లా మార్కాపురంకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కడప జిల్లాలో పని చేస్తున్నాడు. అతడికి భార్య, కుమార్తె ఉన్నారు.
బేస్తవారిపేటకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అతడు తన కుమార్తెను గత నెల 25న తన ఉద్యోగం చేస్తున్న ఊరికి తీసుకెళ్లాడు. అక్కడ తన ప్రియురాలితో కలిసి మద్యం తాగి.. కుమార్తెకు కూడా బలవంతంగా మద్యాన్ని తాగించాడు. ఆపై కుమార్తెపై లైంగిక దాడి చేస్తూ ప్రియురాలితో మొబైల్‌లో వీడియో తీయించాడు.
ఈ విషయం బాధితురాలు తన తల్లితో చెప్పుకొచ్చింది. వెంటనే ఆమె తల్లి అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 2న సాయంత్రం నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి దగ్గర ఉన్న మొబైల్, అందులోని వీడియో, ఫొటోలను సీజ్ చేశారు.