ఆడ‌పిల్ల‌లు జన్మించారని విషం తాగించిన కసాయి తండ్రి

Advertisement

ప్రస్తుత రోజుల్లో ‌పుట్ట‌బోయేది ఆడ‌పిల్ల అని తెలిస్తే చాలు. ఆ పిండాన్ని త‌ల్లి గర్భంలోనే కానరాని లోకానికి పంపిస్తున్నారు కొందరు మానవత్వం లేని మనుషులు. అయితే తాజాగా ఒకే కాన్పులో ఇద్ద‌రు ఆడ‌ శిశువులు జ‌న్మించారని కోపంతో‌ ఆ చిన్న శిశువుల‌కు విష‌మిచ్చాడు ఓ కసాయి తండ్రి. ఇక ఈ విషాదకరమైన సంఘ‌ట‌న మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా లో చోటుచేసుకుంది.

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా గండేడ్ మండ‌లం దేశాయిప‌ల్లి గ్రామానికి చెందిన కృష్ణ‌వేణి, కేశ‌వులు భార్యాభర్తలకు ఈ నెల 1వ తేదీన రాత్రి క‌వ‌ల ఆడ‌పిల్ల‌లు జ‌న్మించారు. అయితే అప్ప‌టికే వారికి ఒక కూతురు ఉంది. ఇక రెండవ కాన్పులో కూడా ఇద్దరు ఆడపిల్లలే పుట్టార‌ని కేశ‌వులు ఆవేద‌న చెందాడు. ఇక కోపంతో ఆ పసి కునాలను చంపడానికి ప్రయ‌త్నించాడు. అయితే తన భార్య‌కు తెలియ‌కుండా ఆ క‌వ‌ల ఆడ శిశువుల‌కు పురుగుల మందు తాగిపించాడు ఆ కసాయి తండ్రి.

ఇక ఇద్దరు పిల్ల‌లు అప‌స్మార‌క స్థితిలో ఉండండంతో ఆ శిశువుల‌ను పిల్ల‌ల ఆసుపత్రిలో చేర్చారు. ఇక ఆ పసి పిల్లలను ప‌రిశీలించిన వైద్యులు విషం తాగించినట్లు గుర్తించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆ ఇద్దరు శిశువుల‌ను మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా ఆసుపత్రికి త‌ర‌లించారు.
అయితే కేశ‌వులు పురుగుల మందు డ‌బ్బా కొనుగోలు చేసిన దృశ్యాలు దగ్గర్లోని సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. దీనితో ఆ పిల్లల తండ్రే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. ప్ర‌స్తుతం ఆ ఇద్ద‌రు కవల పిల్లలు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here