Fat People: ఆ దేశంలో లావుగా ఉండేవాళ్ళు భారీగా సంపాదిస్తున్నార‌ట‌..!

Fat People: ప్రపంచంలో ఏ ఒక్కరూ పర్ఫెక్ట్ గా ఉండరు. ఒకవేళ అలా ఉండాలనుకోవడం కూడా పొరపాటే అనిపించుకుంటుంది. అలాగే లావుగా ఉన్నామని చాలామంది బాధపడుతుంటారు. కానీ ఈ లావుగా ఉన్నవారే ఆ దేశంలో డబ్బులు సంపాదిస్తున్నారు. రండి తమను అద్దెకు తీసుకోవాలని కోరుకుంటూ డబ్బు సంపాదిస్తున్నారు. అదేంటి మనుషుల్ని అద్దెకు తీసుకోవడం ఏంటి అనుకుంటున్నారా.. ఇంకేందుకు ఆలస్యం ఈ డిఫరెంట్ స్టోరి గురించి తెలుసుకోండి.. జపాన్ ఓ కొత్త సంస్థను ఒపెన్ చేశారు. లావుగా ఉండేవారిని అద్దెకు దొరకబడును అనే బోర్డ్ పెట్టారు. ఇలా అద్దెకు తీసుకున్నందుకు 1,333 రూపాయలు డబ్బులు చెల్లిస్తున్నారు.

Fat People

ఇది వినడానికి కాస్త వింతగా ఉన్నా.. జపాన్ లో చాలా నార్మల్ విషయం. ఇలాంటి ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అయితే ఇలా అద్దెకు తీసుకున్నవారితో కేవలం వారి భావోద్వేగాలను మాత్రమే పంచుకుంటారు. ఒక మనిషిగా ఎమోషనల్ స్ట్రెస్ చాలా బాధను ఇస్తుంది. అందుకే అలాంటి భావాలను పంచుకుని హాయిగా సేదతీరడానికి డెబుకారి అనే ఆర్గనైజేషన్ లావుగా ఉండే వ్యక్తుల్ని అద్దెకు ఇవ్వడం మొదలుపెట్టిందట. నిజానికి సుమారు 100 కిలోలు ఉండే వ్యక్తులు జపాన్ లో చాలా అరుదు. అలాంటి వారిని ఆన్ లైన్ లో అద్దెకు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఆ సంస్థ వ్యాపారి గతంలో తన క్యూజిల్లా అనే బ్రాండ్ ను ఎస్టాబ్లిష్ చేయడానికి లావుగా ఉండే వ్యక్తులు దొరికేవారు కాదట. ఆ తర్వాత ఆ క్లాత్స్ ను కొనడానికి వచ్చే వారినే మోడల్స్ గా మార్చేశారు.

అలా మొత్తం 45మందిని జాయిన్ చేసుకుని తన బ్రాండ్స్ ని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తనదగ్గరున్న మోడల్స్ ను అద్దెకు ఇస్తే, ఎలా ఉంటుంది అనుకున్నాడు. గంట చొప్పున అద్దెకు ఇవ్వడం ప్రారంభించారు. అయితే అసలెందుకు వీరిని అద్దెకు తీసుకోవాలని భావించిన వారికి రెండు కారణాలు చెబుతున్నారు. తన బ్రాండెడ్ దుస్తుల్ని సెలెక్ట్ చేసుకునేందుకు వీరు ఉపయోగపడతారు. అలాగే లావుగా ఉన్నామని బాధపడే వారు తమ కంటే ఎక్కువ లావుగా ఉంటే వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే లైఫ్ లో మానసికంగా ఒత్తిడికి గురైన వారు వీరితో మాట్లాడటం వల్ల కాసేపైనా మానసిక ప్రశాంతత లభిస్తుందని అంటున్నారు.