Farmers protest : దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుతం అట్టుడుకుతోంది. దేశవ్యాప్తంగా రైతుల నిరసనలు క్రమంగా హింసాత్మకంగా మారడంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిపోయింది. పార్లమెంటులో తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలు రైతుల అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని…. వాటి వల్ల కార్పొరేట్ కంపెనీలు కోట్లాది రూపాయలు సంపాదించుకుంటారు కానీ రైతులు విపరీతంగా నష్టపోతారని రైతు సంఘాలు వాదిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇది కేవలం ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర అని…. ఈ చట్టాల వల్ల ఎలాంటి .నష్టం జరగదని నొక్కి వక్కాణిస్తోంది.

ఇలాంటి సమయంలో రైతులు నెలలు తరబడి రోడ్లపైన కాలం గడుపుతూ తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం అసలు ఈ చట్టాల వల్ల ఎలాంటి భయం లేదని చెబుతూ ఉన్నారు. దాదాపు పదకొండు దశలలో రైతు సంఘాలకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు ఒక్కొక్కటిగా విఫలం అవుతూనే వచ్చాయి, దేంట్లోనూ సానుకూల ఫలితం రాలేదు. మరి కొత్తగా తీసుకువచ్చిన చట్టాల వల్ల కార్పొరేట్ సంస్థలు ఎలా లాభపడతాయో చాలామందికి స్పష్టత లేదు. అయితే రైతులు మాత్రం ఈ చట్టాలను ఎట్టి పరిస్థితిలో రద్దు చేయాల్సిందేనని భీష్మించుకొని కూర్ఛున్నారు… అన్నదాత కడుపు మీద కొట్టవద్దని కోరుతున్నారు. మొన్న గణతంత్ర దినోత్సవం రోజు ఒక్కసారిగా వారి నిరసన హింసాత్మకంగా మారడంతో సామాన్య ప్రజలకు రైతుల పై కొదిగా నెగటివ్ అభిప్రాయం ఏర్పడింది. అయితే కేంద్రం నిర్లక్ష్య ధోరణి వల్లే పరిస్థితి చేయి దాటిందని మరి కొందరి అభిప్రాయం. ఇక అసలు ఈ గొడవ అంతా కార్పొరేట్ కంపెనీల అత్యాశ వల్లే అని ఇంకొందరు వాదిస్తున్నారు.[yop_poll id=”18″]