Adipurush Movie : ఆదిపురుష్ అయోధ్య ఈవెంట్ ఉండబోతుందా?
NQ Staff - June 1, 2023 / 07:37 PM IST

Adipurush Movie : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో హిందీ మరియు తెలుగు లో రూపొందిన ఆదిపురుష్ సినిమా మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
రాముడి పుట్టిన ప్రదేశంగా పేర్కొనే అయోధ్య లో ఆదిపురుష్ యొక్క భారీ ఈవెంట్ ను నిర్వహించాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం తెల్సిందే.
తిరుపతి ఈవెంట్ తర్వాత అయినా అయోధ్య లో ఒక ఈవెంట్ ను నిర్వహించడం ద్వారా హిందువుల యొక్క దృష్టిని ఆకర్షించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆదిపురుష్ యొక్క సినిమా కు పెట్టిన బడ్జెట్ కి వస్తున్న బజ్ కి సంబంధం లేకుండా ఉంది. కనుక ఇక ముందు అయినా భారీ ఎత్తున ప్రమోషన్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.