Janasena : పవన్ వ్యాఖ్యలకు విస్తుపోతున్న అభిమానులు
NQ Staff - June 22, 2023 / 09:35 PM IST

Janasena : వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న హడావుడికి.. పవన్ చేస్తున్న వ్యాఖ్యలకు ఆయన అభిమానులు కూడా విస్తుపోతున్నారు. గాలిలొ కత్తులు తిప్పుతూ యుద్ధం చేస్తున్నట్లుగా… గాలిలోనే తలలు తెగి పడుతున్నాయి అన్నట్లుగా జనసేన నాయకులు హడావుడి చేస్తున్నారు. నాలుగు రోజుల్లోనే బండారం బయటపడినా డాంబికాలతో కవర్ చేద్దాం అనుకుంటూ మళ్ళీ బొక్క బోర్లా పడిన పవన్ కళ్యాణ్ ఇక చేసేది లేక సైలెంట్ అయ్యాడు.
నాయకులను సంకెళ్లు వేసి రోడ్ల మీద నడిపిస్తూ కొట్టుకుంటూ వెళ్తాను అంటూ చేసిన ప్రకటనతో పవన్ కళ్యాణ్ లో నాయకుడి లక్షణం లేదని తానే క్లారిటీ ఇచ్చేశాడు. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ నాయకులు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు అన్నట్లుగా స్వయంగా జనసైనికులు అంటున్నారట.
ఎవరితోనూ లాలూచీ లేకుండా ఏళ్ల తరబడి కాపు ఉద్యమాన్ని మోస్తున్న ముద్రగడ పద్మనాభం వంటి వారిని అవమానకరంగా మాట్లాడిన పవన్ తాను ఎప్పటికీ చంద్రబాబు మనిషినే అంటూ మరోసారి నిరూపితంచుకున్నాడు.
గత టిడిపి హయాంలో ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని, ఆయన భార్య, కోడలిని సైతం బూతులు తిడుతూ కొట్టుకుంటూ పోలీసులు అరెస్ట్ చేసిన నాడు పవన్ టిడిపి సర్కారులో భాగస్వామిగా ఉన్నారు. మరి ఆయనకు కాపుల మీద అంత ప్రేమ ఉంటే ఆనాడే ముద్రగడ కు దన్నుగా నిలవాల్సినది పోయి ఆనాడు చంద్రబాబు మద్దతుగా నిలిచాడు.
ఇప్పుడు మళ్లీ కాపు ఉద్యమాన్ని తాకట్టు పెట్టారంటూ ముద్రగడ లాంటి మచ్చలేని నాయకుడి మీద పేలిన సంధి ప్రేలాపనలు పవన్ ను ప్రజల్లో మరింత చులకన చేశాయి. ఏనాడూ స్వ లాభం కోసం కులాన్ని వాడుకోని ముద్రగడ, ఎప్పుడు ఉద్యమానికి అవసరం అయితే అప్పుడు మేమున్నాం అంటూ అన్నిరకాల అండదండలు సమకూర్చిన ద్వారంపూడి వంటి వాళ్ళును వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అవమానించడం ద్వారా పవన్ లో మ్యాటర్ లేదని జనసైనికులు స్వయంగా మాట్లాడుకుంటూ విస్తుపోతున్నారు.