Fancy number plates : 9999 నెంబర్ ప్లేట్ ఖరీదు రూ.9,99,999.. ఎవరు దక్కించుకున్నారంటే..?
NQ Staff - September 6, 2023 / 03:32 PM IST

Fancy number plates : చాలామందికి తమ కార్లు, ఇతర వెహికల్స్ కు ఫ్యాన్సీ నెంబర్లు తీసుకోవాలని అనుకుంటారు. అందులో వారికి కలిసి వచ్చే నెంబర్లు తీసుకోవడం అంటే ఇంకా ఇష్టం. అందుకోసం ఎంతైనా ఖర్చు పెట్టేస్తారు. ఇందుకోసం ఆర్టీఏ అధికారులు కూడా ఫ్యాన్సీ నెంబర్లను వేలం వేస్తుంటారు. తాజాగా ఖైరతాబాద్ RTAలో ఫ్యాన్సీ నంబర్ల వేలం నిర్వహించారు.
దీని ద్వారా రూ.18,02,970 ఆదాయం వచ్చినట్లు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాండు రంగనాయక్ వెల్లడించారు. TS 11 EZ 9999 నంబర్ ప్లేట్ ను రూ.9,99,999కు చర్చ్ఎడ్యుకేషనల్ సొసైటీ కొనుగోలు చేసిందని స్పష్టం చేశారు. ఇదే అధిక ధరకు పోయిందని తెలిపారు ఆయన.
ఇక టీఎస్ 11 ఎఫ్ఎ 0001 నంబర్ రూ.3 లక్షలకు కామినేని సాయి శివనాగ్ దక్కించుకున్నట్టు తెలిపారు. అంతే కాకుండా టీఎస్ 11 ఎఫ్ఎ 0011 నంబర్ ను రూ.1,55,400కు సామ రోహిత్ రెడ్డి గెలుచుకున్నట్టు తెలిపారు అధికారులు. ఇలా మూడు నెంబర్ ప్లేట్లకే లక్షలు చెల్లించినట్టు తెలిపారు.