RAM CHARAN: రామ్ చ‌ర‌ణ్ బావ‌కు ప్రేమ లేఖ‌.. మిస్టేక్స్ ఉంటే చెప్ప‌మంటూ అభ్య‌ర్ద‌న‌

అభిమానులందు వీరాభిమానులు వేరు. ఈ వీరాభిమానుల‌లో పురుషులు, మ‌హిళ‌లు కూడా ఉంటారు. వీరు ఇల్లు, ఫ్యామిలీ ఇలాంటివి ఏమి ప‌ట్టించుకోకుండా అభిమాన హీరో కోసం ఏదైన చేసేస్తుంటారు. క‌ష్ట‌మ‌ని తెలిసిన ఇష్టంగా చేసే త‌త్వం ఈ వీరాభిమానుల‌ది. మెగాస్టార్ చిరంజీవి న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్ అంచెలంచెలుగా ఎదుగుతూ వ‌చ్చారు. రంగ‌స్థ‌లం చిత్రంలో ఆయ‌న న‌ట విశ్వ‌రూపం చూపించి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాడు. ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రం చేస్తుండ‌గా, ఈ మూవీ త‌ర్వాత శంక‌ర్ తో క‌లిసి పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు. ఈ చిత్రాల‌తో చ‌ర‌ణ్ క్రేజ్ దేశ విదేశాల‌కు పాక‌డం ఖాయం.

రామ్ చ‌ర‌ణ్‌కు ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువే. చెర్రీకు పెళ్లి అయింద‌ని తెలిసి కూడా కాకినాడ‌కు చెందిన సంధ్య అనే అమ్మాయి ఓ లెట‌ర్‌లో త‌న ప్రేమ‌నంతా బ‌య‌ట‌పెట్టింది. చెర్రీని బావా అని ప్రేమ‌గా పిలుస్తూ లేఖ రాసింది. నా ప్రియాతిప్రియమైన రామ్‌చరణ్‌ బావా…

నా పేరు సంధ్య, మాది కాకినాడ. నీకు నేను వీరాభిమానిని. నీ కళ్లు, నవ్వు, హెయిర్‌, లుక్స్‌, స్టైల్‌, యాటిట్యూడ్‌.. ఇలా ఒక్కటేంటి.. నీలో ప్రతీది ఇష్టమే. నువ్వు చాలా హ్యాండ్‌సమ్‌గా, క్యూట్‌గా.. ఓ రేంజ్‌లో ఉంటావు. ఇక నటన విషయానికొస్తే ఇరగదీస్తావు. ఏ పాత్ర అయినా దాన్ని చింపి పారేస్తావు. నేను నీ సినిమాలు చూసుకుంటూనే పెరిగాను. కేవలం నటన మాత్రమేనా, డ్యాన్సింగ్‌ కూడా ఇచ్చిపడేస్తావు. ఓవరాల్‌గా నన్ను పడగొట్టేశావు. ఏదో ఒకరోజు, ఎప్పుడో ఒకసారి నిన్ను తప్పకుండా కలుస్తానన్న నమ్మకం నాకుంది. ఐ లవ్‌ యూ సో మచ్‌ రామ్‌ చరణ్‌ బావా.. అని రాసుకొచ్చింది.

ప్ర‌స్తుతం సంధ్య రాసిన లేఖ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, దీనిపై నెటిజ‌న్స్ భిన్న ర‌కాలుగా స్పందిస్తున్నారు. కాగా, రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ఆర్ఆర్ఆర్, ఆచార్య చిత్రాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే. ఆచార్య చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కొద్ది సేపు పాత్ర చేసిన అది అభిమానుల‌కి ఎంత‌గానో న‌చ్చుతుంద‌ని అంటున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామ‌రాజుగా అద‌రగొట్ట‌నున్నాడు.

Advertisement