Covid : పెద్ద ఊరట : కోవిడ్ కొత్త వేరియంట్‌పై ప్రముఖ వైద్యులేమంటున్నారంటే.!

NQ Staff - December 23, 2022 / 09:48 PM IST

Covid : పెద్ద ఊరట : కోవిడ్ కొత్త వేరియంట్‌పై ప్రముఖ వైద్యులేమంటున్నారంటే.!

Covid : కోవిడ్ కొత్త వేరియంట్ ప్రభావమెంత.? ఇంకోసారి దేశంలో లాక్ డౌన్ తప్పదా.? ఇప్పుడున్న వ్యాక్సిన్లను కొత్త వేరియంట్ లెక్క చేయడంలేదా.? చాలా అనుమానాలు తెరపైకొస్తున్నాయి. బోల్డన్ని దుష్ప్రచారాలూ జరుగుతున్నాయి.

కొత్త వేరియంట్ అత్యంత ప్రమాదకరమైనదంటూ ప్రచారం జరుగుతున్న వేళ, హైద్రాబాద్‌కి చెందిన ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఓ మంచి మాట చెప్పారు. పెద్ద ఊరటనిచ్చే మాట ఇది.

ప్రాణాంతకం కాదు..

కోవిడ్ కొత్త వేరియంట్ ప్రాణాంతకం కాదనీ, మునుపటిలా పెద్దగా ప్రభావం చూపదనీ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చెప్పారు. బూస్టర్ డోసుగా వేరే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఈ వైరస్‌ని తట్టుకునే శక్తి అధికంగా లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

చైనాలో తక్కువ నాణ్యత గలిగిన వ్యాక్సిన్లు వాడటం వల్లే అక్కడ భయంకరమైన పరిస్థితులు వచ్చాయని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చెప్పారు. అయితే, ఒకరి నుంచి 10 మందికి వ్యాపించే శక్తి బీఎఫ్7 వేరియంట్‌కి వుంది గనుక, జనం గుమికూడే ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరి అని ఆయన చెప్పారు.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us