Vimalesh : ‘కోమా’ నాటకం.! ఏడాదిన్నరగా ఇంట్లోనే మృతదేహం.!
NQ Staff - September 24, 2022 / 01:35 PM IST

Vimalesh : ఓ వ్యక్తి ఏడాదిన్నర క్రితం మరణిస్తే, ఆ మృతదేహంతోనే ఏడాదిన్నరపాటు ఇంట్లోనే వున్నారు మృతుడి కుటుంబ సభ్యులు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే, ఉత్తరపప్రదేశ్ రాష్ట్రంలోని రావత్‌పూర్‌లోని శివపురి ప్రాంతానికి చెందిన విమలేష్ అనే వ్యక్తి 2021 ఏప్రిల్ 22న మరణించాడు. ఆయన అహ్మదాబాద్‌లో ఆధాయపు పన్నుశాఖలో పనిచేసేవారట.
అనారోగ్యంతో కన్నుమూసిన విమలేష్ విషయాన్ని కుటుంబ సభ్యులు బయటకు వెల్లడించలేదు.

Family Members Kept Vimalesh Dead Body In The House
పెన్షన్ కోసం మరణ ధృవీకరణ పత్రం..
పెన్షన్ కోసం విమలేష్ భార్య మిథాలీ తన భర్త మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించడంతో మొత్తం విషయం బయటపడింది. పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Family Members Kept Vimalesh Dead Body In The House
విమలేష్ కోమాలో వున్నాడంటూ ఇంతకాలం బంధువుల్ని అలాగే చుట్టుపక్కలవారినీ నమ్మించింది అతని కుటుంబం. అసలు మృతదేహాన్ని ఇంట్లో ఏడాదిన్నరకాలం పాటు ఎలా వుంచుకోగలిగారు.? అన్నది సస్పెన్స్‌గా మారింది.
కాగా, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆసుపత్రికి తరలించి, పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.