Pet Dog in Jagtial: పెంపుడు కుక్క మ‌ర‌ణం.. మ‌ట‌న్ కూర‌తో ఊరంద‌రికి భోజ‌నం

Pet Dog in Jagtial: ఈ రోజుల్లో మ‌నుషుల క‌న్నా ఎక్కువ‌గా పెంపుడు జంతువుల‌ని చూసుకుంటున్నారు. వాటికి బ‌ర్త్ డేలు జ‌ర‌ప‌డం, పార్టీల‌కి తీసుకెళ్ల‌డం వాటికి సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుండ‌డం వంటివి చేస్తున్నారు. అన్ని జంతువుల‌లో క‌న్నా కుక్క చాలా విశ్వాసంగా ఉంటుంది. అన్నం పెట్టిన మేలు ఎప్పుడు కోరుకుంటుంది. అందుకే ఆ కుక్క‌కి ఏదైన జ‌రిగితే య‌జ‌మాని ఎంతో బాధ‌ప‌డుతుంటారు.

Family holds ‘Peddakarma’ for pet dog in Jagtial
Family holds ‘Peddakarma’ for pet dog in Jagtial

తమ పెంపుడు కుక్కలకు పిల్లలతో సమానంగా ఆస్తులు రాసిన వార్తలు వింటూనే ఉన్నాం.. అయితే ఇప్పుడు తమ పెంపుడు కుక్క మరణాన్ని మనిషికి చేసినట్లు కర్మకాండలు చేసిన వ్య‌క్తి వార్త‌ల‌లోకి ఎక్కారు. జ‌గిత్యాల జిల్లాలో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న ప్ర‌తి ఒక్క‌రిని స‌ర్‌ప్రైజ్ చేస్తుంది.

వివ‌రాల‌లోకి వెళితే జగిత్యాలలో విద్యానగర్‌లో నివాసం ఉండే కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, సుమ దంపతులు ఆరేళ్ల కిందట ఓ శునకాన్ని పెంచుకోవడానికి ఇంటికి తెచ్చుకున్నారు. అప్పుడు దానికి ‘అఖిల’ అనే పేరు పెట్టుకున్నారు. ముద్దుగా మిల్కీ అని పిలుచుకుంటున్నారు. పిల్ల‌ల‌తో స‌మానంగా మిల్కీని చూసుకునేవారు.

శ్రీనివాస్ రెడ్డి, సుమ ఎక్కడికి వెళ్లినా పనిమీద వెళ్లినా, ఫంక్షన్లకు వెళ్లినా మిల్కీ తమ వెంట తీసుకుని వెళ్లేవారట. ఇంట్లో ఉంటె ఈ మిల్కీ ఇంట్లో ఉన్న వారి వెనుక వెనుక తిరుగుతూ తెగ సందడి చేసేది. కొన్ని రోజుల క్రితం మిల్కీకి జ‌బ్బు చేసి ఆసుపత్రి పాలైంది. ఎన్ని చోట్లకు తిప్పినా, ఏం చేసినా కూడా మిల్కీని బ్ర‌తికించుకోలేక‌పోయారు.

హైదరాబాద్ లో ఓ ఫంక్షన్ కు శ్రీనివాస్ రెడ్డి దంపతులు హాజరుకావాల్సి ఉండ‌గా, వారితో పాటు మిల్కీని కూడా హైదరాబాద్ కు తీసుకుని వచ్చారు. హైదరాబాద్ లోనే ఆగస్ట్ 21 న మిల్కీ మరణించింది. దీంతో వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే జగిత్యాల వచ్చిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి, సుమ దంపతులు మిల్కీ కి మూడో రోజు, ఐదో రోజు కార్యక్రమాలు నిర్వహించారు. సెప్టెంబర్ 1న పెద్దకర్మ నిర్వహించారు. గ్రామస్థులను పిలిచి మ‌ట‌న్ కూర‌తో భోజనాలు కూడా పెట్టారని స‌మాచారం.