Fake Currency : మాదాపూర్ రోడ్డుపై నోట్ల క‌ట్ట‌లు.. ఎగ‌బ‌డ్డ వాహ‌నదారులు

Fake Currency : ఇటీవ‌లి కాలంలో న‌కిలీ నోట్ల క‌ల‌క‌లం ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తున్నాయి.ఆ మ‌ధ్య సంగారెడ్డిలో న‌కిలీనోట్లు రోడ్డుపై కుప్పలు తెప్ప‌లుగా ప‌డ్డాయి. ఇవి చూసి అంద‌రు షాకయ్యారు. ఇక తాజాగా మాదాపూర్‌లో 100 ఫీట్‌ రోడ్‌కు సమీపంలోని కాకతీయ రోడ్డులో బుధవారం గుట్టలుగుట్టలుగా 2,000 నోట్లు ఉండడంతో స్థానికులు, వాహనాదారులు నోట్ల కోసం ఎగబడ్డారు.

Fake Currency notes found on madhapur hyd
Fake Currency notes found on madhapur hyd

ఎవరికి దొరికిన డబ్బులు వారు తీసుకొని అక్కడ నుంచి తీసుకొనివెళ్లిపోయారు. అయితే అప్పుడే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. కాగా, ఆ డబ్బులు తీసుకున్న వారి ఆ నోట్లను తదేకంగా చూడగా అవాక్కవడం వారి వంతైంది. రూ.2 వేల నోట్లపై చిల్డ్రన్ ఆఫ్ ఇండియా అని ఉండటంతో నోట్లు తీసుకెళ్లినవారంతా నిరుత్సాహానికి గురయ్యారు.

నకిలీ కరెన్సీ నోట్లని తెలియక చాలామంది నోట్లను తీసుకునేందుకు ఎగబడ్డారు. కొంతసేపు భారీగా ట్రాఫిక్ జాం అయింది. ట్రాఫిక్ పోలీసులు శ్రమించి ట్రాఫిక్​ను క్లియర్ చేయించారు. రోడ్లపై గుట్టలుగా పడి ఉన్న నకిలీ రూ.2 వేల కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎంతో ఆశగా డబ్బులు పట్టుకుని ఇంటికి వెళ్లిన చాలామందికి ఇది టీవీల్లో చూస్తే కానీ తెలియలేదు. అక్కడ దొరికిన డబ్బులన్నీ నకిలీవని.

గత ఏడాదిలో హైదరాబాద్ నగరంలోని గోల్కండ పరిధిలో నకిలీ కరెన్సీ కలకం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు భారీ మొత్తంలో నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నోట్లతో సంబంధం కలిగిన ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో దగ్గర లభ్యమైన సంచుల్లో రూ.2వేలు, రూ.500 నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.