రష్యా వ్యాక్సిన్ ఉత్తి ముచ్చటే

Advertisement

ప్రపంచం మొత్తం కరోనా తో అల్లాడిపోతున్న సమయాన రష్యా వ్యాక్సిన్ విడుదల చేసి ప్రపంచంలోనే అని దేశాలు రష్యా వైపు చూసేలా చేసింది. అయితే ఆ వ్యాక్సిన్ కి సంబంధించి ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ సీరియస్ అవుతుంది. అయితే ఈ టీకా కరోనాకు శాశ్వత రోగనిరోధక శక్తిని ఇస్తుందని రష్యా అధికారులు వెల్లడించారు. కాని రష్యా ఎటువంటి రుజువు ఇవ్వలేదని డబ్ల్యూహెచ్‌ఓ యూరప్‌లోని సీనియర్ అత్యవసర అధికారి కేథరీన్ స్మాల్‌వుడ్ వెల్లడించారు.

వ్యాక్సిన్ అభివృద్ధిలో అన్ని చర్యలను ఏజెన్సీ స్వాగతించింది. కాని ప్రతి వ్యాక్సిన్ తప్పనిసరిగా క్లీనికల్ ట్రయల్స్ పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు. రష్యా వ్యాక్సిన్ ఇప్పటివరకు చాలా తక్కువ మందిలో మాత్రమే పరీక్షించబడిందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here