మాకు బీజేపీతో సంబంధం లేదు: ఫేస్ బుక్

Advertisement

కొన్నిరోజుల క్రితం కరోనా విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని ఆయన చేసిన పోస్టులను ఫేస్ బుక్ అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇండియాలో మాత్రం ఫేస్ బుక్ అధికారులు బీజేపీకి సానుభూతి పరులుగా వ్యవహరిస్తున్నారని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భాజపాకు చెందిన నాయకుల విద్వేషపూరిత ప్రసంగాలు, అభ్యంతరకరమైన పోస్టులను సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌ చూసీచూడనట్లు వదిలేస్తోందంటూ వచ్చిన ఆరోపణలపై సోమవారం ఆ సంస్థ స్పందించింది. సదరు వ్యక్తుల రాజకీయ పార్టీ, స్థాయితో సంబంధం లేకుండా సంస్థ తన విధానాలను అమలు చేస్తోందని స్పష్టం చేసింది.

విద్వేషపూరిత ప్రసంగాలు, అభ్యంతరకరమైన పోస్టులను తాము వ్యక్తి యొక్క హోదాకు సంబంధం లేకుండా తొలగిస్తున్నామని, ఈ విషయంలో తాము ఇంకా మెరుగు పడాల్సిన అవసరం ఉందని ఫేస్ బుక్ అధికారులు తెలిపారు. ఫేస్ బుక్, ట్విట్టర్ లు మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here