Bandi Sanjay Going Delhi Tour : టీ బీజేపీ చీఫ్ ఢిల్లీ టూర్‌పై ఉత్కంఠ
NQ Staff - June 26, 2023 / 04:31 PM IST

Bandi Sanjay Going Delhi Tour : తెలంగాణ బీజేపీ లో లుకలుకలు ఇటీవల బయట పడ్డ విషయం తెల్సిందే. బీఆర్‌ఎస్ నుండి వెళ్లిన ఈటెల రాజేందర్.. కాంగ్రెస్ నుండి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు రాష్ట్ర అధ్యక్షుడితో పార్టీ లో కొనసాగలేక పోతున్నారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతే కాకుండా తమకు తగిన గుర్తింపు రావడం లేదు అంటూ ఢిల్లీ అధినాయకత్వం వద్ద ఈ ఇద్దరు నాయకులు పంచాయితీ పెట్టడం జరిగింది.
తమకు రాష్ట్రంలో ఉన్న స్థాయికి తగ్గట్లుగా పార్టీ పదవి లేదు అంటూ వారు బీజేపీ అధినాయకత్వం వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారట. అంతే కాకుండా రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో కూడా వారు కేంద్ర మంత్రులు మరియు జాతీయ అధ్యక్షుడితో చర్చించారు అంటూ వార్తలు వచ్చాయి.
ఈటెల మరియు కోమటిరెడ్డిల ఢిల్లీ యాత్ర ముగియడంతో ఇప్పుడు బీజేపీ తెలంగాణ చీఫ్ ఢిల్లీ టూర్ కి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈటెల మరియు కోమటిరెడ్డిలతో చర్చించిన విషయాల గురించి పార్టీ అధినాయకత్వం బండి తో చర్చించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
బండితో చర్చించిన తర్వాత ఏమైనా కీలక నిర్ణయాలను బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకుంటుందా అంటూ పార్టీ నాయకులతో పాటు రాష్ట్ర రాజకీయ విశ్లేషకులు మరియు ఇతర పార్టీల నాయకులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. మొత్తానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యొక్క ఢిల్లీ టూర్ పై ఉత్కంఠ కొనసాగుతోంది.