కోమాలో ప్రణబ్ ముఖర్జీ పరిస్థితి విషమం

Advertisement

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమంగా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని ఆర్మీ రీసర్చ్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రణబ్ మెదడులో రక్తం గడ్డ కట్టడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆ తరువాత ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని, అలాగే డీప్ కోమాలో ఉన్నాడని ఆర్మీ ఆసుపత్రి వైద్య బృందం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

ప్రణబ్ కు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరిగిందని డాక్టర్లు వెల్లడించారు. ఇప్పటివరకు తనకు అందించిన వైద్యం ఎలాంటి ప్రభావం చూపలేదని తెలిపారు. అలాగే ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స జరుగుతున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here