Etela Rajender : ఈటలను బర్తరఫ్ చేయడం.. హరీశ్ రావుకు కలిసొచ్చిందా? పార్టీలో యాక్టివ్ అయిన హరీశ్?

Etela Rajender : మంత్రి హరీశ్ రావు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయన్నను పార్టీలో అందరూ ట్రబుల్ షూటర్ అని అంటుంటారు. టీఆర్ఎస్ పార్టీలో హరీశ్ రావుది ప్రత్యేక స్థానం. పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్న ఆయన ఆ మధ్య కొన్ని రోజులు సైలెంట్ అయిపోయారు. పార్టీ కీలక వ్యవహారాల్లోనూ పాల్గొనలేదు. ఏది ఏమైనా.. కేసీఆర్ అల్లుడు కావడంతో.. వాళ్ల మధ్య ఏవైనా విభేదాలు వచ్చాయేమో అని అంతా అనుకున్నారు. కానీ.. ప్రస్తుతం ఈటల రాజేందర్ ను సీఎం కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం.. హరీశ్ రావుకు కలిసి వచ్చిందనే చెప్పాలి.

etela rajender vs harish rao trs
etela rajender vs harish rao trs

ఎందుకంటే.. మొన్నటి దాకా సైలెంట్ గా ఉన్న హరీశ్ రావు.. ప్రస్తుతం యాక్టివ్ అయ్యారు. ఈటల రాజేందర్ శాఖ అయిన వైద్యారోగ్య శాఖ బాధ్యతలను హరీశ్ రావే దగ్గరుండి చూసుకుంటున్నారు. ముఖ్యమంత్రి వెంటే ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. కరోనా నియంత్రణలో ప్రస్తుతం బిజీబిగా గడుపుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. ఈటల బయటికి వెళ్లడం.. ఒక్క హరీశ్ రావుకు బాగా కలిసి వచ్చిందని.. ఈటలను బర్తరఫ్ చేసి.. కేసీఆర్.. మంత్రి హరీశ్ రావుకు ఆ బాధ్యతలన్నింటినీ అప్పజెప్పారని తెలుస్తోంది.

అయితే.. ఈటల వల్లనే ప్రస్తుతం హరీశ్ కు మంచి రోజులు వచ్చాయని.. నిన్న మొన్నటి దాకా.. అసలు.. పార్టీ కీలక వ్యవహారాల్లోనూ, ప్రభుత్వ వ్యవహారాల్లోనూ ఎక్కడా కనిపించని హరీశ్.. ఇప్పుడు బాగా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఇదంతా ఈటల వల్ల వచ్చిన పుణ్యమే.. అంటూ ఈటల వర్గీయులు అంటున్నారు. ఒకవేళ ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికకు వెళ్తే.. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించే బాధ్యతను కూడా హరీశ్ రావే తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. మంత్రి హరీశ్ రావు మరోసారి పార్టీలో, ప్రభుత్వంలో యాక్టివ్ అవ్వడంతో.. ఆయన అభిమానులు తెగ సంతోషిస్తున్నారు.