Etela Rajender : నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు… ఈటల రాజేందర్ ట్వీట్

Etela Rajender : అందరూ అనుకున్నట్టుగానే… అందరూ ఊహించినట్టుగానే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మంత్రి పదవి పోయింది. డైరెక్ట్ గా కాకుండా… అన్నీ ఇన్ డైరెక్ట్ గా జరిగాయి. వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్ కు కేటాయిస్తూ తెలంగాణ గవర్నర్ తమిళిసై ఇవాళ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈటల రాజేందర్ కొన్ని ట్వీట్లు చేశారు.

etela rajender tweets on health workers
etela rajender tweets on health workers

తాను వైద్యారోగ్య మంత్రిగా ఉన్న సమయంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. గత రెండు సంవత్సరాలుగా ముఖ్యంగా గత 395 రోజులుగా ఒక్క రోజు కూడా విరామం లేకుండా పనిచేస్తూ వైద్యారోగ్య శాఖ మంత్రిగా నాకు ఎంతో సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు… అంటూ ట్వీట్ చేశారు ఈటల.

అలాగే… కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి.. కుటుంబాలను వదిలిపెట్టి ప్రజలకు కరోనా చికిత్స అందించిన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, డాక్టర్లఅ, నర్సులు, సెక్యూరిటీ, శానిటరీ, నాలుగవ తరగతి సిబ్బంది, గ్రామాల్లో పనిచేస్తున్న ఏఎన్ఎమ్ లు, ఆశా వర్కర్లు, అందరికీ శిరస్సు వంచి ధన్యవాదములు తెలుపుతున్నాను… అంటూ మరో ట్వీట్ చేశారు ఈటల.

Advertisement